Site icon vidhaatha

Udyam MSME Registration | బ్యాంకు లోన్లు, ప్రభుత్వ పథకాలు కావాలా?: MSMEలు ఈ రిజిస్ట్రేషన్ చేసుకొంటే చాలు

Udyam MSME Loans

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు స్థాపించేవారికి ఉద్యం కింద రిజిస్ట్రేషన్ చేయాలని కేంద్రం సూచించింది. 2020 జూలై1న ఈ విధానం అమల్లోకి తెచ్చింది. ఉద్యం రిజిస్ట్రేషన్ చేసుకున్న సంస్థలకు తక్కువ వడ్డీలకు పెట్టుబడితో పాటు ఇతర సౌకర్యాలు కూడా అందుతాయి. ఎంఎస్ఎంఈలను గుర్తించి ప్రోత్సహించడమే దీని లక్ష్యం. ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకొంటే రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఇది ఎంఎస్ఎంఈల గుర్తింపు సంఖ్యగా పరిగణిస్తారు. పరిశ్రమలు ఏర్పాటు చేసుకొనే వారిని ప్రోత్సహించడంతో పాటు ప్రభుత్వ పథకాలను పరిశ్రమల యజమానులకు నేరుగా అందేలా ఈ పోర్టల్ పనిచేస్తోంది. అంతకుముందు ఉద్యోగ్ ఆధార్ మెమోరాండం (UAM) స్థానంలో లో దీన్ని తెచ్చారు.

ఉద్యం రిజిస్ట్రేషన్ ఎందుకు?

ఒక పరిశ్రమను ఉద్యంలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే తక్కువ వడ్డీకే బ్యాంకులు రుణాలు ఇస్తాయి. పరిశ్రమలు ఏర్పాటు చేసుకొనే వారికి ప్రభుత్వాలు అందించే ప్రోత్సాహకాలు, సబ్సిడీ ఇతరత్రా సౌకర్యాలు పొందేందుకు ఇది ఉపయోగపడుతోంది. మినిమం అల్టర్‌నేటివ్ ట్యాక్స్ క్రెడిట్స్ మరో ఐదేళ్లు పెరుగుతాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో లింక్ తో ఉన్నందున ప్రభుత్వ టెండర్లు కూడా పొందేందుకు సులువైన మార్గం. ఒకవేళ పరిశ్రమ ఏర్పాటు చేసిన ఏదేని కారణాలతో అప్పులు పేరుకుపోతే వన్ టైమ్ సెటిల్ మెంట్ కూడా అర్హత లభిస్తోంది.

ఎలాంటి సంస్థలు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు?

ఎంటర్‌ప్రైజ్ టైప్ ఇన్వెస్ట్‌మెంట్ లిమిట్ టర్నోవర్ లిమిట్
సూక్ష్మ రూ.2.5 కోట్లు రూ.10 కోట్ల వరకు
చిన్న రూ.25 కోట్లు రూ.100 కోట్ల వరకు
మధ్య తరహా రూ.50 కోట్లు రూ.250 కోట్ల వరకు

ఉద్యం రిజిస్ట్రేషన్ కు డాక్యుమెంట్స్ కావాల్సిన డాక్యుమెంట్లు

PAN కార్డు
GST సర్టిఫికేట్
యజమాని ఆధార్ కాపీ
కుల సర్టిఫికెట్
ఫోన్ నంబర్
ఇ-మెయిల్ అడ్రస్
వ్యాపార ప్రారంభ తేదీ
బ్యాంకు అకౌంట్ (A/C) నంబర్ IFSC కోడ్
ఉద్యోగుల సంఖ్య (పురుష, మహిళల విభాగాలతో)
వ్యాపార స్వభావం (nature of the business)
ఆడిట్ రిపోర్ట్

ఉద్యం పోర్టల్‌లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి

ఉద్యం అధికారిక వెబ్ సైట్ udyamregistration.gov.in లో MSME గా కొత్త వ్యాపార వేత్తలు EM-2 ఆఫ్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత మీ పూర్తి వివరాలను ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డులో ఉన్నట్టుగానే మీ పేరు , ఆధార్ నెంబర్ ను నింపాలి. ఆ తర్వాత ఓటీపీ జనరేట్ బటన్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఆధార్ కార్డుకు లింక్ చేసిన ఫోన్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని నమోదు చేసిన తర్వాత మీ ఆధార్ ధృవీకరణ పూర్తి అవుతుంది. ఆ తర్వాత పాన్ వాలిడేషన్ చేయాలి. దీనికి సంబంధించి ఇదే తరహాలో నింపాల్సి ఉంటుంది. ఆదాయ పన్ను రిటర్న్స్ కు సంబంధించిన వివరాలు నమోదు చేయాలి. GSTIN వర్తిస్తోందో లేదో చెప్పాలి. ఒకవేళ వర్తిస్తే ఆ వివరాలు కూడా సబ్ మిట్ చేయాలి. ఇవన్నీ పూర్తి చేస్తేనే మీకు ఉద్యం రిజిస్ట్రేషన్ ధరఖాస్తు ఫారం వస్తోంది. ఇందులో ప్రతి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. మీ వ్యాపారంలో భాగస్వాములు ఉంటే వారి నుంచి వివరాలు కూడా నమోదు చేయాలి. మీ సంస్థలో ఎంత మంది పనిచేస్తున్నారో వారి సంఖ్యను ఇవ్వాలి. పెట్టుబడి వివరాలతో పాటు ఇతర అంశాలను నింపాలి. అన్ని వివరాలు నింపిన తర్వాత ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఇందులో ఏమైనా తప్పులుంటే ఇబ్బందులు వస్తాయా. అందుకే సబ్ మిట్ చేసే ముందు ఫాం మొత్తం ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఓటీపిని నమోదు చేసి సబ్ మిట్ బటన్ క్లిక్ చేయాలి. అప్పుడు ఉద్యం రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయినట్టు. దీనికి సంబంధించిన సర్టిఫికెట్ మీరు ఇచ్చిన అడ్రస్ కు , మెయిల్ కు పంపుతారు. ఉద్యం రిజిస్ట్రేషన్ నెంబర్ URN నెంబర్ ను కూడా పంపుతారు. ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకొంటే చాలు. ఒక్క సంస్థ ఒకేసారి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

 

 

Exit mobile version