బంగారం కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌.. స్వల్పంగా తగ్గిన ధర.. హైదరాబాద్‌లో నేడు ధరలు ఇలా..!

కొనుగోలుదారులకు బంగారం ధరలు ఊరటనిచ్చాయి. నిన్న భారీగా తగ్గిన ధరలు సోమవారం మరోసారి పతనమయ్యాయి

  • Publish Date - November 13, 2023 / 03:47 AM IST

కొనుగోలుదారులకు బంగారం ధరలు ఊరటనిచ్చాయి. నిన్న భారీగా తగ్గిన ధరలు సోమవారం మరోసారి పతనమయ్యాయి. 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.10 తగ్గి తులం రూ.55,450 పలుకుతున్నది. ఇక 24 క్యారెట్ల బంగారంపై రూ.10 తగ్గడంతో రూ.60,590కి తగ్గింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.55,690 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.60,740కి చేరింది.


ముంబయిలో 22 క్యారెట్ల స్వర్ణం రూ.55,540 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్​ రూ.60,590 వద్ద ట్రేడవుతున్నది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.55,990 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.61,080కి పతనమైంది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.55,540 ఉండగా.. క్యారెట్ల గోల్డ్‌ రూ.60,590 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతితో పాటు పలు నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధర నిలకడగా ఉన్నది. హైదరాబాద్‌లో వెండి కిలోకు రూ.76వేలు పలుకుతున్నది.