మగువలకు షాక్‌ ఇచ్చిన బంగారం, వెండి.. మరోసారి భారీగా పెరిగిన ధర..!

బంగారం ధరలు మగువలకు షాక్‌ ఇచ్చాయి. నిన్న స్వల్పంగా పెరిగిన ధర గురువారం మరోసారి భారీగా పెరిగింది. 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.400 పెరిగి తులానికి రూ.55,950కి ఎగిసింది

  • Publish Date - November 16, 2023 / 10:19 AM IST

బంగారం ధరలు మగువలకు షాక్‌ ఇచ్చాయి. నిన్న స్వల్పంగా పెరిగిన ధర గురువారం మరోసారి భారీగా పెరిగింది. 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.400 పెరిగి తులానికి రూ.55,950కి ఎగిసింది. 24 క్యారెట్ల బంగారంపై రూ.440 పెరగ్గా.. తులం రూ.61,040 ధర పలుకుతున్నది. వెండి ధరలు సైతం భారీగా పెరిగాయి. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.56,450 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.61,580కి పెరిగింది.


ముంబయిలో 22 క్యారెట్ల పుత్తడి రూ.55,950 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.61,040కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.56,100 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.61,190 వద్ద ట్రేడవుతున్నది. బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.55,950 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.61,040కి చేరింది. ఇక హైదరాబాద్‌లో ధరలను పరిశీలిస్తే.. 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.55,950 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.61,040 ధర పలుకుతున్నది.


ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరోవైపు వెండి ధర సైతం ఒకేరోజు భారీగా పెరిగింది. రూ.1700 పెరిగి కిలో రూ.74,700 ఎగిసింది. హైదరాబాద్‌లో కిలో బంగారం ధర రూ.77,700కు చేరింది. అయితే, అంతర్జాతీయ మార్కెట్‌లో యూఎస్‌ బాండ్‌ ఈల్డ్స్‌, డాలర్‌ తగ్గడంతో మరోసారి పసిడికి డిమాండ్‌ పెరిగింది. ప్రస్తుతం ఔన్స్‌కు 1970 డాలర్లకుపైగా పలుకుతున్నది.