అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడికి డిమాండ్‌..! హైదరాబాద్‌లో నేడు ధరలు ఎలా ఉన్నాయంటే..?

అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడికి డిమాండ్‌ పెరుగుతున్నది. అగ్రరాజ్యం అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు నిలిచిపోతుందన్న అంచనాలున్నాయి

  • Publish Date - November 19, 2023 / 05:45 AM IST

విధాత‌: అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడికి డిమాండ్‌ పెరుగుతున్నది. అగ్రరాజ్యం అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు నిలిచిపోతుందన్న అంచనాలున్నాయి. దీంతో పసిడి పరుగులు తీస్తున్నది. ప్రస్తుతం బంగారం ఔన్స్‌కు 1,983 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. దేశంలో ఇటీవల బంగారం ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి.


అయితే, బులియన్‌ మార్కెట్‌లో ఆదివారం బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధర స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.56,700 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.61,840 వద్ద కొనసాగుతున్నది. చెన్నైలో 22 క్యారెట్ల పుత్తడి రూ.57వేలు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.62,180 వద్ద ట్రేడవుతున్నది.


ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.56,550 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.61,690 వద్ద నిలకడగా ఉన్నది. బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.55,550 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.61,690 వద్ద కొనసాగుతున్నది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.56,550 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.61,690 పలుకుతున్నది.


ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా.. వెండి ధర స్వల్పం తగ్గుముఖం పట్టింది. రూ.500 తగ్గి కిలో వెండి రూ.76వేలు పలుకుతున్నది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.79వేలు పలుకుతున్నది.