విధాత: మధ్యప్రాశ్చ్యంలో యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో పుత్తడి రేటు భారీగా పెరుగుతున్నది. ఈ క్రమంలో 1900 డాలర్లపైన ట్రేడవుతున్నది. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై సైతం విపరీతంగా పెరుగుతున్నది. ఆదివారం ఒకేరోజూ రూ.1500 వరకు పెరుగుదల నమోదైంది. సోమవారం సైతం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. తులానికి రూ.10 పెరగడంతో 22 క్యారెట్ల గోల్డ్ రూ.55,410 పలుకుతున్నది. 24 క్యారెట్ల గోల్డ్ రూ.60,450కి చేరింది.
ఇక దేశవ్యాప్తంగా బంగారం ధరలను పరిశీలిస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.55,560 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.60,560కి చేరింది. ముంబయిలో 22 క్యారెట్ల పసిడి రూ.55,410 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.60,450 పలుకుతున్నది. చెన్నైలో 22క్యారెట్ల స్వర్ణం రూ.55,560 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.60,610కి చేరింది.
బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ రూ.55,410 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.60,450కి చేరింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.రూ.55,410 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.రూ.60,450 పలుకుతున్నది. ఏపీలోని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతితో పాటు పలు నగరాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి. మరో వైపు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.77వేలకు పలుకుతున్నది.