తగ్గేదెలే అంటున్న బంగారం..! మళ్లీ రూ.60వేలు దాటిన పుత్తడి..!

  • Publish Date - October 21, 2023 / 04:43 AM IST

విధాత‌: దసరా పండుగకు ముందు బంగారం ధరలు మగువలకు మరోసారి షాక్‌ ఇచ్చాయి. ఇటీవల బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా శనివారం బులియన్‌ మార్కెట్‌లో మరోసారి ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.700 పెరిగి.. తులానికి రూ.56,400 పలుకుతున్నది. 24 క్యారెట్ల గోల్డ్‌పై రూ.770 పెరిగి.. తులానికి రూ.61,530 పలుకుతున్నది. దేశంలోని వివిధ నగరాల్లో ధరలు పరిశీలిస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.56,550 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.61,690కి చేరింది.


ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.56,400 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.61,530కి పెరిగింది. చెన్నైలో 22 క్యారెట్ల పుత్తడి రూ.56,600 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.61,750కి ఎగిసింది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గోల్డ్​ రూ.56,400 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.61,530 పలుకుతున్నది. ఏపీలోని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు దేశంలో వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో వెండి కిలో రూ.77,500 పలుకుతున్నది. అదే సమయంలో ప్లాటినం ధర రూ.290 పెరిగింది. ప్రస్తుతానికి తులం రూ.24,010 పలుకుతున్నది.