బంగారం కొనుగోలుదారులకు రిలీఫ్‌.. స్వల్పంగా తగ్గిన ధర

  • Publish Date - October 24, 2023 / 04:56 AM IST

విధాత‌: బంగారం ధరలు కొనుగోలుదారులకు స్వల్ప ఊరటనిచ్చాయి. ఇటీవల పుత్తడి ధరలు విపరీతంగా పెరిగాయి. బులియన్‌ మార్కెట్‌లో స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.250 తగ్గి తులానికి రూ.56,350 పలుకుతున్నది. 24 క్యారెట్ల గోల్డ్‌పై రూ.300 దిగివచ్చి తులానికి రూ.61,450కి చేరింది. దేశంలోని వివిధ నగరాల్లో ధరలు పరిశీలిస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.56,500 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.61,600 వద్ద కొనసాగుతున్నది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.56,350 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.61,450కి తగ్గింది.


చెన్నైలో 22 క్యారెట్ల పుత్తడి రూ.56,600 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.61,750కి ఎగిసింది. బెంగళూరులో 22 క్యారెట్ల పుత్తడి రూ.56,350 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.61,450 పలుకుతున్నది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గోల్డ్​ రూ.56,350 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.61,450 పలుకుతున్నది. ఏపీలోని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు దేశంలో వెండి ధరలు సైతం స్వల్పం దిగివచ్చాయి. రూ.200 తగ్గి కిలోకు రూ.75,100 పలుకుతున్నది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.78,500కి చేరింది.