Site icon vidhaatha

Gold Price | అక్షయ తృతీయ వేళ దిగొచ్చిన బంగారం ధరలు.. తులం ధర ఎంతంటే..!

Gold Price : అక్షయ తృతీయ వేళ బంగారం ధరలు దిగొచ్చాయి. కొన్ని రోజులుగా పెరిగిన బంగారం ధరలు ఈరోజు తగ్గాయి. అక్షయ తృతీయనాడు బంగారం కొనుగోలు చేస్తే శుభం జరుగుతుందనే ఆనవాయితీకి తోడు ఇవాళ గోల్డ్‌ ధరలు కూడా తగ్గడంతో కొనుగోళ్లు పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉన్నది. అంతర్జాతీయంగా ఔన్స్ గోల్డ్ ధర 2,310 డాలర్లుగా, సిల్వర్ ధర 26 డాలర్లుగా ఉంది. ఈ నేపథ్యంలో దేశీయంగా బంగారం, వెండి ధరలు కూడా తగ్గాయి.

బులియన్ మార్కెట్ ప్రకారం.. మే 10న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,150గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.72,160 గా ఉంది. మే 9న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,250 పలుకగా శుక్రవారం రూ.100 తగ్గింది. న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,290 ఉండగా.. 24 క్యారెట్స్‌ గోల్డ్ ధర రూ.72,300గా నమోదైంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,150 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.72,150 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.66,150 పలుకుతోంది. 24 క్యారెట్ల ధర 10 గ్రాములకు రూ.72,150గా ఉంది. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.66,150 పలుకుతుండగా.. 24 క్యారెట్ల ధర 10 గ్రాములకు రూ.72,150 పలుకుతోంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.66,150 గా ఉంది. 24 క్యారెట్ల ధర రూ.72,150 పలుకుతోంది. బంగారం ధరలు తగ్గినప్పటికీ వెండి ధరలు పెరిగాయి. శుక్రవారం ఓవరాల్‌గా కిలో వెండి ధర రూ.85,200గా నమోదైంది. గురువారంతో పోలిస్తే శుక్రవారం రూ.200 పెరిగింది. ముంబైలో రూ.85,200, చెన్నైలో రూ.88,700, బెంగుళూరులో 85,200, హైదరాబాద్‌లో రూ.88,700గా కిలో వెండి ధరలు ఉన్నాయి.

Exit mobile version