మహిళలకు రిలీఫ్‌.. స్వల్పంగా తగ్గిన బంగారం ధర..!

  • Publish Date - November 1, 2023 / 04:31 AM IST

మహిళలకు గుడ్‌న్యూస్‌ ఊరట కలిగించే వార్త. వరుసగా రెండోరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.500 తగ్గి రూ.56,700కి చేరింది. 24 క్యారెట్ల బంగారం రూ.550 పతనమై.. రూ.61,850కి దిగివచ్చింది. దేశవ్యాప్తంగా పలు నగరాల్లోనూ ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.56,850 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.62,000కి చేరింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.56,700 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.61,850కి తగ్గింది.


చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.57,150 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.62,350కి చేరింది. బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.56,700 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.68,850కి చేరింది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.56,700 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.61,850 పలుకుతున్నది. ఏపీలోని తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధరలు స్వల్పంగా తగ్గింది. రూ.300 తగ్గడంతో కిలోకు రూ.75,300కి చేరింది. హైదరాబాద్‌లో కిలో ధర రూ.78,200 పలుకుతున్నది.