మగువలకు షాక్‌..! మరోసారి ఎగిసిన బంగారం, వెండి ధరలు..! హైదరాబాద్‌లో తులానికి రూ.58వేలపైనే..!

  • Publish Date - October 10, 2023 / 06:01 AM IST

విధాత‌: పుత్తడి ధరలు మగువలకు షాక్‌ ఇస్తూనే ఉన్నాయి. వరుసగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా మంగళవారం సైతం ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారంపై రూ.200 పెరిగి తులానికి రూ.23,350కి పెరిగింది. అదే సమయంలో 24 క్యారెట్ల గోల్డ్‌పై రూ.220 పెరిగి.. తులానికి రూ.58,200కి ఎగిసింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.53,500 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.58,350కి పెరిగింది. ముంబయిలో 22 క్యారెట్ల పసిడి రూ.53,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.58,200 పలుకుతున్నది.


బెంగళూరులో 22 క్యారెట్ల పుత్తడి రూ.53,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.58,200కి చేరింది. చెన్నైలో 22 క్యారెట్ల స్వర్ణం రూ.53,650 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.58,530 వద్ద ట్రేడవుతున్నది. ఇక హైదరాబాద్‌లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.53,350 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.58,200 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతితో పాటు పలు నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు నిన్న స్థిరంగా కొనసాగిన వెండి ధరలు మంగళవారం పెరిగాయి. రూ.500 పెరిగి కిలో రూ.72,600 వద్ద ట్రేడవుతున్నది. ఇక హైదరాబాద్‌లో కిలోకు రూ.75,500 పలకుతున్నది.