మగువలకు ఊరట..! స్థిరంగా బంగారం ధరలు..!

  • Publish Date - November 5, 2023 / 06:24 AM IST

మగువలకు పసిడి ధరల కాస్త ఊరటస్తున్నాయి. ఇటీవల వరుసగా పెరుగూ వచ్చిన ధరలు కాస్త ఉపశమనం కల్పించాయి. బులియన్‌ మార్కెట్‌లో ఆదివారం బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు నిలకడగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.56,650గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.61,790 వద్ద స్థిరంగా ఉన్నది.


ముంబయిలో 22 క్యారెట్ల పసిడి రూ.56,500 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.61,640 వద్ద కొనసాగుతున్నది. చెన్నైలో 22 క్యారెట్ల స్వర్ణం రూ.57,150 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.62,350 వద్ద నిలకడగా ఉన్నది. బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.56,500 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.61,640 వద్ద కొనసాగుతున్నది.


ఇక హైదరాబాద్‌లో పసిడి రూ.56,500 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.61,640 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధరలు సైతం స్థిరంగానే కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో వెండి కిలో రూ.78వేలు పలుకుతున్నది. అలాగే ప్లాటినం ధరలు సైతం నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్‌లో తులం రూ.24,910 వద్ద స్థిరంగా ఉన్నది.