బంగారం ధరలు మగువలకు ఊరటనిచ్చాయి. నిన్న మొన్నటి వరకు విపరీతంగా పెరుగుతూ వచ్చిన ధరలు శనివారం బులియన్ మార్కెట్‌లో స్థిరంగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల తులం బంగారం రూ.56,800 వద్ద కొనసాగుతున్నది. 24 క్యారెట్ల పుత్తడి రూ.61,960 వద్ద స్థిరంగా ఉన్నది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశంలోని వివిధ నగరాల్లోనూ ధరలను పరిశీలిస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.56,950 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.62,110 పలుకుతున్నది. ముంబయిలో 22 క్యారెట్ల పుత్తడి రూ.56,800 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.61,960 వద్ద నిలకడగా ఉన్నది.
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.57,000 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.62,200 వద్ద ట్రేడవుతున్నది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం రూ.56,800 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.61,960 వద్ద కొనసాగుతున్నది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గోల్డ్ రూ.56,800 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.61,960 పలుకుతున్నది. ఏపీలోని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు దేశంలో వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. కిలోకు రూ.500 తగ్గి రూ.74,600కి చేరింది. ఇక హైదరాబాద్‌లో వెండి కిలోకు రూ.77,500 పలుకుతున్నది.