Site icon vidhaatha

GST | జీఎస్టీలో రెండు స్లాబ్‌లు: బంగారంపై జీఎస్టీ తగ్గిందా? పెరిగిందా?

GST

ఈ నెల 22 నుంచి జీఎస్టీలో రెండు రకాల స్లాబ్ లు మాత్రమే ఉంటాయి. అయితే చాలా వస్తువులపై జీఎస్టీ తగ్గించారు. బంగారంపై జీఎస్టీ తగ్గించారా? పెంచారా ? అనేది ప్రతి ఒక్కరికి ఆసక్తి ఉంటుంది. ఇప్పటికే బంగారం ధరలు సామాన్యుడి అందనంతగా పెరిగాయి. జీఎస్టీ స్లాబ్ ను పెంచితే సామాన్యులపై అది మరింత భారంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం జీఎస్టీలో 5,12,18, 28 అనే నాలుగు రకాల స్లాబ్‌లున్నాయి. ఈ నెల 22 నుంచి 5, 18 స్లాబ్ లు మాత్రమే కొనసాగుతాయి. అయితే కొన్ని రకాల వస్తువులపై 40 శాతం స్లాబ్ లను అమలు చేయనున్నారు.

ఇప్పటి వరకు బంగారం, వెండి ఆభరణాలపై 3 శాతం జీఎస్టీని వసూలు చేస్తున్నారు. అయితే ఆభరణాల తయారీపై 5 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. బంగారం నాణెలు, బంగారం బిస్కట్లు లేదా బార్లపై కూడా 3 శాతం జీఎస్టీ ఉంది. ప్రస్తుతం విధిస్తున్న జీఎస్టీనే కొనసాగించాలని జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్ణయం తీసుకుంది. అంటే బంగారం, వెండి పై జీఎస్టీలో మార్పులు లేవు.

ఖరీదైన కార్లు, పొగాకు ఉత్పత్తులపై ప్రత్యేకంగా 40 శాతం జీఎస్టీ స్లాబ్ ను ప్రతిపాదించారు. వ్యక్తిగత వస్తువులకు పన్ను తగ్గించారు. సిమెంట్, తలనూనెలు, షాంపూ, టూత్ పేస్ట్, సబ్బులు, షేవింగ్ క్రీమ్ వంటి వాటిపై జీఎస్టీ 18 నుంచి 5 శాతానికి తగ్గనుంది. 350 సీసీ వరకు ఉన్న బైకులు, 1200 లోపు ఉన్న వాహనాలపై ఉన్న జీఎస్టీ 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గనుంది.

Exit mobile version