Credit Card Rules | ఈ నాలుగు బ్యాంకుల క్రెడిట్‌కార్డులున్నాయా..? జూన్‌ నుంచి మారనున్న కీలక రూల్స్‌..!

Credit Card Rules | క్రెడిట్‌కార్డు హోల్డర్లకు అలెర్ట్‌. త్వరలో పలు బ్యాంకుల క్రెడిట్‌కార్డు రూల్స్‌ మారబోతున్నాయి. ఆయా కార్డులకు సంబంధించిన ఫీజులు ఛార్జీలు, రివార్డ్‌ పాయింట్స్‌ తదితర రూల్స్‌ను మారుస్తూ నిర్ణయం తీసుకున్నది. తప్పనిసరిగా మార్పులు ఏంటో తెలుసుకుంటే ఇబ్బందులుండవు.

  • Publish Date - May 28, 2024 / 12:00 PM IST

Credit Card Rules | క్రెడిట్‌కార్డు హోల్డర్లకు అలెర్ట్‌. త్వరలో పలు బ్యాంకుల క్రెడిట్‌కార్డు రూల్స్‌ మారబోతున్నాయి. ఆయా కార్డులకు సంబంధించిన ఫీజులు ఛార్జీలు, రివార్డ్‌ పాయింట్స్‌ తదితర రూల్స్‌ను మారుస్తూ నిర్ణయం తీసుకున్నది. తప్పనిసరిగా మార్పులు ఏంటో తెలుసుకుంటే ఇబ్బందులుండవు. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యెస్‌ బ్యాంక్‌, ఐడీబీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌ బ్యాంకులు జూన్‌ నుంచి పలు కార్డుల నియమ నిబంధనల్లో మార్పు చేశాయి. మరి అవేంటో చూద్దామా..!

హెచ్‌డీఎఫ్‌సీ స్విగ్గీ క్రెడిట్‌కార్డ్‌..

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ జారీ చేసిన స్విగ్గీ క్రెడిట్‌కార్డు యూజర్లకు నిజంగా ఇది శుభవార్తే. బ్యాంక్‌ క్రెడిట్‌కార్డు క్యాష్‌బ్యాక్‌లో కీలక మార్పులు చేసింది. ఈ మార్పులు జూన్‌ 21 నుంచి అమలులోకి రారానున్నాయి. జూన్‌ 21 నుంచి పొందిన ఏదైనా క్యాష్‌బ్యాక్‌ స్విగ్గీ మనీకి బదులుగా క్రెడిట్‌కార్డు స్టేట్‌మెంట్‌లో కనిపించనున్నది. ఇకపై క్యాష్‌బ్యాక్‌ ప్రస్తుతం బిల్‌ కింద యాడ్‌ అవుతుంది. మీరు చెల్లించే బిల్లు తగ్గుతుంది.

జీఎస్టీ విధించబోతున్న ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌

ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌బ్యాంక్‌ వినియోగదారులకు షాక్‌ ఇచ్చేందుకు సిద్ధమైంది. యుటిలిటీ బిల్లుల కోసం క్రెడిట్ కార్డ్ చెల్లింపులు రూ.20వేలు దాటితే ఇకపై ఒకశాతం జీఎస్టీని విధించనున్నట్లు పేర్కొంది. స్టేట్‌మెంట్ సైకిల్‌లో యుటిలిటీ బిల్లు లావాదేవీలు (గ్యాస్, విద్యుత్, ఇంటర్నెట్) రూ.20వేలు అంతకన్నా ఎక్కువ, తక్కువ ఉన్నా సర్‌ఛార్జి ఉండదు. అయితే, తొలి ప్రైవేట్‌ క్రెడిట్‌కార్డ్‌, ఎల్‌ఐసీ క్లాసిక్‌ క్రెడిట్‌ కార్డ్‌, ఎల్‌ఐసీ సెలెక్ట్‌ క్రెడిట్‌ కార్లుపై యుటిలిటీ సర్‌ఛార్జ్ ఉండదు.

వడ్డీ రేట్లు పెంచిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా

బ్యాంక్‌ బరోడా బీఓబీకార్డ్‌ వన్‌ కోబ్రాండెడ్‌ క్రెడిట్‌కార్డులపై వడ్డీ రేటు, ఆలస్య రుసుములను పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ఈ పెరిగిన రేట్లు జూన్‌ 26 నుంచి అమలులోకి రానున్నాయి. బకాయిలపై వడ్డీ రేటు నెలకు 3.49శాతం నుంచి నెలకు 3.57శాతానికి పెంచింది. బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై ఆలస్యమైన చెల్లింపులు మరింత ఖరీదు కానున్నాయి. మీరు చెల్లింపు చేయలేకపోయినా.. చెల్లించాల్సిన కనీస మొత్తం కంటే తక్కువ చెల్లించినా.. భారీగా ఛార్జీలు విధించబోతున్నది. సకాలంలో బిల్లులు చెల్లించి అధిక ఛార్జీల నుంచి తప్పించుకోవచ్చు.

నిబంధనలను సవరించిన యెస్ బ్యాంక్

యెస్ బ్యాంక్ ‘ప్రైవేట్’ క్రెడిట్ కార్డ్‌లను మినహాయించి మిగతా అన్ని రకాల క్రెడిట్‌కార్డుల్లో వివిధ మార్పులు ఏసింది. బ్యాంక్ నిర్దిష్ట క్రెడిట్ కార్డులతో ఫ్యూయల్‌ కొనుగోళ్లకు సంబంధించి ఫీజులను సర్దుబాటు చేసే అవకాశం ఉంది. వార్షిక, జాయినింగ్‌ ఫీజుల విషయంలోనూ మార్పులు చేయబోతున్నది. అదే సమయంల యుటిలిటీ లావాదేవీలకు సంబంధించిన ఫీజుల్లో మార్పులు చేసే అవకాశాలున్నాయి.

Latest News