ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో భారత్(India) జోరందుకుంటోంది. మారుతి, మహింద్రా, టాటా, హ్యూండయ్లు కొత్త ఎలక్ట్రిక్ మాడళ్ల తయారీలో తలమునకలై ఉన్నాయి. ఇందులో అది ప్రధానమైన బ్యాటరీ(Car Battery)పై ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. తక్కువ చార్జింగ్ సమయం, ఎక్కువ మైలేజీ అనేవే కరెంటు వాహనాల అతి ముఖ్యమైన అవసరం.
ఈ నేపథ్యంలో, రాబోతున్న కొన్ని ఎస్‌యూవీలు భారత్‌లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వీటి గురించి భారతీయులు ఇంటర్నెట్తో తెగ వెతుకుతున్నట్లు వెల్లడైంది. అన్నట్లు ఇవన్నీ భారత్‌లో తయారయ్యేవే. తయారీవే. అన్నీ మేడ్ ఇన్ ఇండియా కార్లే. అవేంటో తెలుసా… మారుతి సుజుకీ ఈవీఎక్స్, హ్యూండయ్ క్రెటా ఈవీ, టాటా సియెరా ఈవీ, మహింద్రా ఎక్స్యూవీ ఈ8, హోండా ఎలివేట్ ఈవీ.
- మారుతి సుజుకీ ఈవీఎక్స్(Maruti Suzuli eVX):
మారుతీ సుజుకీ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహనాన్ని 2025లో భారత్‌లో ప్రవేశపెట్టనుంది. 2025 జనవరి 17 నుండి 25 వరకు ఢిల్లీలొ జరగనున్న భారత్ మొబిలిటీ ఎక్స్పో–2025(Bharat Mobility Expo-2025)లో మారుతి అసలైన ఈవీఎక్స్‌ను ప్రదర్శించనుంది. దీని కాన్సెప్ట్‌ను 2022 ఆటో ఎక్స్‌పోలో చూపించింది. ఈ మారుతి సుజుకి ఈవీఎక్స్ మొదటగా యూరప్, జపాన్ మార్కెట్లలో ప్రవేశించనుంది. తర్వాత 2025 తొలి త్రైమాసికంలోనే భారత్‌లో అమ్మకాలు మొదలవుతాయి.
- హ్యూండయి క్రెటా ఈవీ(Hyundai Creta EV):
హ్యూండయ్ తన అత్యంత విజయవంతమైన మాడల్ క్రెటాలో ఎలక్ట్రిక్ వర్షన్‌ను తీసుకురాబోతోంది. ఈ ఎస్‌యూవీని భారత్, విదేశాల రోడ్లపై చాలాసార్లు పరీక్షించారు. కొన్ని విడి భాగాలు పెట్రోల్ బండివే అయినా, డిజైన్పరంగా ఉత్తమంగా తీర్చిదిద్దారు. కోనా ఎలక్ట్రిక్(Kona Electric)తో పవర్‌కు సంబంధించి కొన్ని పోలికలుంటాయని ఊహిస్తున్నారు. 2025 తొలి అర్థసంవత్సరంలోనే ఈ ఎస్యూవీ మార్కెట్లోకి రానుంది. భారత అభిమానులు బాగా ఎదురుచూస్తున్న ఎస్‌యూవీల్లో ఇది ఒకటి.
- టాటా సియోరా ఈవీ(Tata Sierra EV):
టాటా మోటార్స్ తన పాత హిట్ మాడళైన సియెరా(Sierra)ను మళ్లీ కొత్త అవతారంలో ప్రవేశపెడుతోంది. ఈసారి ఎలక్ట్రిక్ రూపంలో. టాటా సియెరా ఎలక్ట్రిక్ ఈవీ మొదటి లుక్‌ను ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది. ఉత్పత్తికి వెళ్తున్న మోడల్‌ను గతేడాది భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో ప్రదర్శించింది. 2026లో ఈ వాహనం విడుదల అవబోతోంది.
- మహింద్రా ఎక్స్యూవీ.ఈ8(Mahindra XUV.e8):
భారత్ ఎదురుచూస్తున్నమరో ఎస్యూవీ మహింద్రా ఎక్స్యూవీ.ఈ8. మహింద్రా విడుదల చేయబోయే ఐదు విద్యుత్ వాహనాల్లో ఇది చాలా ప్రతిష్టాత్మకమైన ఎస్యూవీ. ఇది మహింద్రా వారి అత్యంత విజయవంతమైన వాహనం ఎక్స్యూవీ700(XUV700)కు విద్యుత్ రూపం. కొలతలు, బయటి డిజైన్, ఇంటీరియర్స్ అన్నీ 700లానే ఉన్నాయి. కాకపోతే, చూట్టానికి అందంపరంగా కొన్ని మార్పులు చేసారు. ఇవే 700ను ఈ8ను వేరు చేస్తున్నాయి. ఈ ఏడాది చివరికల్లా ఇది విడుదల కానున్నట్లు సమాచారం.
- హోండా ఎలివేట్ ఈవీ(Honda Elevate EV):
ఈ ఎలివేట్ ఈవీ భారత్‌లోనే తయారై, విదేశాలకు ఎగుమతి కానుంది. ఇంది కాంపాక్ట్ ఎస్యూవీ(Compact SUV) మాడల్. మూడేళ్లలో మార్కెట్లోకి తీసుకొస్తామని గతంలో ఈ జపాన్ కార్ మేకర్ ప్రకటించింది. అయితే ఈ కార్కు సంబంధించిన వివరాలు ఇంకా గోప్యంగానే ఉన్నాయి.