Weekly Horoscope | ఈ వారం రాశిఫ‌లాలు.. ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో మాధుర్యం..!

Weekly Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని విశ్వసిస్తుంటారు. ఈ క్ర‌మంలో ప్ర‌తి రోజు, ప్ర‌తి వారం త‌మ రాశిఫ‌లాల‌కు అనుగుణంగా వ్య‌క్తులు త‌మ కార్య‌క‌లాపాల‌ను కొన‌సాగిస్తుంటారు. మ‌రి ఈ వారం రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Vidhaatha Weekly Horoscope

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి వృత్తి పరంగా మధ్యస్థంగా ఉంటుంది. ప్రారంభించిన పనులన్నీ యధావిధిగా సాగుతాయి. ఉద్యోగులకు వృత్తిపరంగా మంచి కాలం నడుస్తోంది. మీ కష్టానికి తగ్గ గుర్తింపు, పదోన్నతి లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వ్యాపారులకు ఈ వారం స్థిరమైన ప్రగతి గోచరిస్తోంది. ఆర్థిక పరంగా ఈ వారం అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఖర్చులను అదుపు చేస్తూ ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు అన్వేషించాలి. ప్రేమ విషయాల్లో కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు. కుటుంబ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. వైవాహిక జీవితంలో స్వల్ప ఉద్రిక్తతలకు అవకాశం ఉన్నందున జీవిత భాగస్వామితో ఓర్పుగా వ్యవహరించాలి. పెద్దలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం. విద్యార్థులు చదువుపై దృష్టి సారించి, విజయం కోసం అదనపు కృషి చేయాలి.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ వారం ఎంతో అనుకూలంగా ఉంది. వృత్తి పరంగా విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయి. వ్యాపారం బ్రహ్మాండంగా సాగుతుంది. వ్యాపారులు కొంత అంకితభావంతో కృషి చేస్తే తిరుగులేని విజయాలను అందుకుంటారు. ఉద్యోగులు పని ప్రదేశంలో ఆచి తూచి నడుచుకోవాలి. ప్రతి చిన్న విషయాన్నీ జాగ్రత్తగా గమనిస్తూ సమర్ధవంతంగా పనిచేస్తే అధికారుల ప్రసంశలు అందుతాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా ఎటువంటి ఆందోళన అవసరం లేదు. ప్రేమ బంధాలు క్రమంగా బలపడతాయి. వైవాహిక జీవితంలో మాధుర్యం నెలకొంటుంది. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్లడం వల్ల సాన్నిహిత్యం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ వారం ప్రయోజనకరంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ వారం కొత్త అవకాశాలతో ఆహ్వానం పలుకుతుంది. వ్యాపారులకు భాగస్వామ్య వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. కొత్త అవకాశాల వల్ల లాభాలు గణనీయంగా పెరుగుతాయి. ఉద్యోగులకు పని ప్రదేశంలో అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ చిన్న చిన్న సమస్యలు తప్పకపోవచ్చు. అందరినీ కలుపుకుని ముందుకు పోవడం వలన సమస్యలు అధిగమించవచ్చు. ఆర్థికంగా అప్రమత్తంగా ఉండాలి. రుణభారం పెరగకుండా చూసుకోండి. ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు వల్ల చిన్నపాటి ఇబ్బందులు రావచ్చు. కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చే అవకాశం ఉన్నందున వాదనలకు దూరంగా ఉండండి. జీవిత భాగస్వామి అభిప్రాయానికి విలువ ఇవ్వడం మంచిది.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ వారం వృత్తి పరంగా, వ్యక్తిగతంగా సాధారణ ఫలితాలు ఉంటాయి. వ్యాపారులు వ్యాపార విస్తరణ కోసం గట్టి ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. సంస్థ వృద్ధి కోసం అధికంగా పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. వ్యూహాత్మక నిర్ణయాలతో లాభాలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు పనిభారం, శ్రమ పెరుగుతాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తికాక ఒత్తిడికి గురవుతారు. పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయడం వలన ఒత్తిడి తగ్గుతుంది. కొత్త ఆదాయ మార్గాలు లభించడంతో ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ప్రేమ వ్యవహారాల్లో ఓర్పు వహించండి. కుటుంబ కలహాలు రాకుండా జాగ్రత్త పడాలి.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ వారం అన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. వ్యాపారులకు అనుకూలంగానే ఉన్నప్పటికీ పని నిమిత్తం వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. లాభాలు కూడా తగ్గుతాయి. పెట్టుబడి పెట్టే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. ఉద్యోగంలో శ్రమకు తగిన ఫలితాలు ఉండవచ్చు. అధికారులతో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు వద్దు. ప్రతి విషయాన్నీ నిశితంగా పరిశీలించిన తర్వాతనే ముందడుగు వేయాలి. సమయం అంత అనుకూలంగా లేదు కాబట్టి ఈ సమయంలో రుణాలు తీసుకోవద్దు. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి.కుటుంబంలో పెద్దల మాటలకు విలువ ఇవ్వడం మంచిది.

కన్య (Virgo)

కన్యా రాశి వారికి ఈ వారం ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారులకు ఈ వారం ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు లభిస్తాయి. ముఖ్యంగా స్థిరాస్తి రంగం వారికి ఈ వారం ఫలవంతంగా ఉంటుంది. కొనుగోళ్లు, అమ్మకాలు జోరందుకుంటాయి. ఉద్యోగులకు కృషికి తగిన ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది. పదోన్నతులతో పాటు స్థానచలనం సూచన కూడా ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ వ్యవహారాల్లో చిన్నపాటి విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి అవగాహనతో ముందుకెళ్లడం మంచిది. కుటుంబ సభ్యులతో అనుబంధం దృఢ పడుతుంది. ఒక తీర్థయాత్రకు వెళ్లే అవకాశం కూడా ఉంది. ఉన్నత విద్య అభ్యసించేవారు మంచి ఫలితాలను అందుకుంటారు.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. వ్యాపారంలో నష్టభయం ఎక్కువగా ఉన్నందున కొత్త పెట్టుబడుల జోలికి వెళ్ళద్దు. సమిష్టి నిర్ణయాలతో ముందుకెళ్లడం మంచిది. ప్రయాణాలు కలిసిరావు. ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మిశ్రమంగా ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరిగినప్పటికీ ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ప్రేమ వ్యవహారాల్లో అపార్ధాలు రాకుండా జాగ్రత్త పడాలి. కుటుంబంలో గొడవలు, మనస్పర్థలు వచ్చే అవకాశం ఉన్నందున వీలైనంత వరకు శాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది కాబట్టి చిన్న చిన్న అనారోగ్య సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయవద్దు.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఈ వారం శుభ ఫలితాలు పొందుతారు. వ్యాపారులు ఈ వారం చక్కగా రాణిస్తారు. భారీ లాభాలు చేకూరే అవకాశం ఉంది. ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రణాళికాబద్ధంగా నడుచుకోవడం వల్ల సకాలంలో అన్ని పనులు పూర్తవుతాయి. మీ సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. ప్రమోషన్ ఛాన్స్ ఉంది. ఖర్చులు తగ్గడం, ఆదాయం పెరగడం ఆనందం కలిగిస్తుంది. ప్రేమ విషయాల్లో భావవ్యక్తీకరణ ద్వారా అపార్ధాలు తొలగుతాయి. కుటుంబంలో సుఖసంతోషాలు నెలకొంటాయి. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్లడం వల్ల సాన్నిహిత్యం పెరుగుతుంది. ఆరోగ్యం స్థిరంగా ఉన్నప్పటికీ, మానసిక ఒత్తిడి కలగకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి ఈ వారం కృషికి తగిన ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో పోటీ పెరగడంతో కొంత ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రయాణాలు తప్పక పోవచ్చు. ఆశించిన లాభాల కోసం అధికంగా శ్రమపడాల్సి ఉంటుంది. ఉద్యోగంలో సమస్యలు తగ్గుతాయి. అధికారుల అండదండలు, సహోద్యోగుల సహకారంతో పెండింగ్ పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. మీ ప్రతిభను ఉన్నతాధికారులు గుర్తిస్తారు. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం కూడా ఉంది. ఆర్థికంగా ఈ వారం బాగుంది. ప్రేమ వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. జీవిత భాగస్వామితో అనుబంధం దృఢ పడుతుంది.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. వ్యాపారులు బుద్ధిబలంతో, చక్కని ప్రణాళికతో మంచి లాభాలను ఆర్జిస్తారు. ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. ఉద్యోగ మార్పు కోరుకునే వారు మంచి అవకాశాలు అందుకుంటారు. అయితే ప్రస్తుత ఉద్యోగంలోనే ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. కుటుంబంతో తీర్థయాత్రలకు వెళ్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు క్రమశిక్షణతో చదివితే విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ వారం అద్భుతంగా ఉండబోతోంది. అన్ని రంగాల వారు తమ తమ రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వ్యాపారంలో మంచి అభివృద్ధి గోచరిస్తోంది. ఉద్యోగులు ఈ వారం చురుగ్గా పని చేసి లక్ష్యాలను సునాయాసంగా చేరుకుంటారు. ఆటంకాలను సమర్ధవంతంగా అధిగమిస్తారు. అధికారుల ప్రసంశలు పొందుతారు. ఆదాయం కూడా పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే అకస్మాత్తుగా వచ్చే ఖర్చుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రేమ వ్యవహారాలు హాయిగా సాగుతాయి. కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్తారు.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి ఈ వారం శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. వ్యాపారులకు భాగస్వామ్య వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. సమిష్ఠి కృషితో మంచి గుర్తింపు, విజయం పొందుతారు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఉద్యోగంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉండవచ్చు కాబట్టి ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. మితిమీరిన ఆత్మవిశ్వాసం ఒక్కోసారి ప్రమాదం కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడం మేలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉన్నప్పటికీ కొన్ని అనివార్యమైన ఖర్చులు ఉండవచ్చు కాబట్టి ప్రణాళికాబద్ధంగా నడుచుకోవాలి. ప్రేమ వ్యవహారాల్లో సమస్యలు తొలగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో లౌక్యంతో నడుచుకోవాలి. జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తకుండా ఓర్పు వహించాలి.

Latest News