విధాత: అండర్-19 వరల్డ్ కప్‌లో భాగంగా బులవాయో వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో భారత్ బౌలర్ల ధాటికి కివీస్ యువ బ్యాటర్లు 135పరుగులకు అలౌట్ అయ్యారు. వర్షం కారణంగా 47ఓవర్లకు కుదించిన మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన భారత జట్టు బౌలింగ్ ఎంచుకుంది.భారత్ బౌలర్లు రాణించడంతో 36.2ఓవర్లలో న్యూజిలాండ్ బ్యాటర్లు 135పరుగులతో సరిపెట్టుకున్నారు. కల్లమ్ శాంసన్ చేసిన 37పరుగులే ఆ జట్టులో అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. భారత్ బౌలర్లలో అంబ్రిష్ 4వికెట్లు,హెనిల్ పటేల్ 3,ఖిలాన్ పటేల్, మహ్మద్ ఎనాన్, కాన్షిక్ చౌహాన్ తలో వికెట్ పడగొట్టారు.
136పరుగుల స్వల్ప లక్ష్య చేధనకు యువ భారత్ బ్యాటింగ్ కొనసాగిస్తుంది. ఆయుష్ మాత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ(వైస్ కెప్టెన్) లు భారత్ బ్యాటింగ్ లో కీలకంగా ఉన్నారు. ఈ టోర్నీలో ఇంతకుముందు యూఎస్‌ఏ, బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచుల్లో టీమ్ఇండియా గెలిచింది. రెండు విజయాలతో నాలుగు పాయింట్లు సాధించడం ద్వారా గ్రూప్ బిలో ప్రస్తుతం భారత జట్టు మొదటి స్థానంలో ఉండటం విశేషం.
ఇవి కూడా చదవండి :
Indian Food At Davos : సమోసా నుంచి కిచిడీ వరకూ.. దావోస్ సదస్సులో ప్రపంచ నాయకులను ఆకర్షించిన ఇండియన్ ఫుడ్
ICC Replaces Bangladesh With Scotland | బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్
