Horoscope | ఆదివారం రాశిఫ‌లాలు.. ఈ రాశి వారికి ఈ రోజు జీవితంలో అనుకోని మలుపు..!

Horoscope | జ్యోతిష్యం అంటే న‌మ్మ‌కం. మ‌న‌కు అంతా మంచే జ‌ర‌గాల‌ని కోరుకుంటాం.. అందువ‌ల్ల ఈ రోజు మ‌న రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయ‌ని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సావధానంగా, ఏకాగ్రతతో పనిచేస్తే ఉద్యోగ వ్యాపారాల్లో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో విజయం సిద్ధిస్తుంది. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగు పడుతుంది. కుటుంబ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. ఊహించని ఖర్చులు ఉండవచ్చు.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. వ్యక్తిగత జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. సంతానం నుంచి, కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థిక లాభాలు ఉంటాయి.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో శుభ యోగాలున్నాయి. మీ ప్రతిభకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వృత్తి పరంగా ఇచ్చిన వాగ్దానాలు నిలుపుకోడానికి ప్రయత్నించండి. బంధుమిత్రులతో విభేదాలకు దూరంగా ఉండండి. గంత కొంతకాలంగా వేధిస్తున్న ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోండి. అవగాహనా లోపంతో ఆర్థికంగా మోసపోయే ప్రమాదముంది. నమ్మించి మోసం చేసే వారుంటారు. ఎవరినీ గుడ్డిగా నమ్మకండి. ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన ఫలితాల కోసం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని విధాలా యోగ్యమైన కాలం నడుస్తోంది. వృత్తి పరంగా మీరు ఆశించిన ఫలితాలు పొందగలరు. ఉద్యోగంలో అత్యున్నత స్థాయికి చేరుకుంటారు. వ్యక్తిగతంగా ఈ రోజు మీ జీవితంలో అనుకోని మలుపు తిరుగుతుంది. సన్నిహితులతో మంచి సమయం గడుపుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

కన్య (Virgo)

కన్య రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. స్థిరమైన ఆలోచనతో చేసే పనులు విజయానికి చేరువ చేస్తాయి. పరోపకార బుద్ధితో చేపట్టిన సత్కార్యాలు మీకు కీర్తి ప్రతిష్ఠలు సంపాదించి పెడతాయి. స్నేహితులతో ఆహ్లాదంగా గడుపుతారు. వ్యాపారంలో ధనయోగం ఉంది. వ్యాపార భాగస్వాములతో మంచి సంబంధాలను కలిగివుంటారు.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాలలో నూతన అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఆర్థికాభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. వృత్తిలో మీ నైపుణ్యాన్ని అందరు ప్రశంసిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీస్సులతో ప్రయాణాలు ఫలవంతం అవుతాయి.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ పెరగకుండా చూసుకోండి. వ్యాపార సంబంధిత పనులపై ప్రయాణానికి సిద్ధంగా ఉండండి. మంచి పనులు ప్రారంభిస్తారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే సత్ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో బాధ్యతాయుతంగా వ్యవహరించి అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ రోజు విజయవంతంగా ఉంటుంది. ధర్మసిద్ధి ఉంది. మీ స్వధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. కీలకమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో అర్థలాభం ఉంది. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. ఆర్థికంగా జాగ్రత్త వహించాలి. ఖర్చుల విషయంలో తెలివిగా వ్యవహరించండి.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది. మనోబలంతో ముందుకు సాగితే ఆశించిన ఫలితాలు పొందవచ్చు. పనులు వాయిదా వేయకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయడం మంచిది. కుటుంబ వ్యవహారాల్లో ఆచి తూచి అడుగేయాలి. ఊహించని ఖర్చులు ఈ రోజు మిమ్మల్ని చుట్టుముడతాయి.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యక్తిగతంగా, వృత్తి పరంగా అభివృద్ధికి సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంటారు. గ్రహసంచారం అనుకూలంగా ఉన్నందున చేపట్టిన పనులన్నీ సావకాశంగా పూర్తవుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ముందస్తు ప్రణాళికలు మేలు చేస్తాయి. మొహమాటం వల్ల ఖర్చులు పెరిగే ప్రమాదముంది.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో కార్యజయం ఉంటుంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో స్థిరత్వం నెలకొంటుంది. ఆర్థికంగా శుభ ఫలితాలు పొందుతారు. రావలసిన బకాయిలు చేతికి అందుతాయి. పొదుపు ప్రణాళికలు వేస్తారు. బంధు మిత్రులతో శుభకార్యాల్లో ఆనందంగా గడుపుతారు.

Latest News