విధాత : ఐఏఎస్ శ్రీకాంత్ రెడ్డి, ఐపీఎస్ శేషాద్రిని రెడ్డిలు ఎలాంటి ఆడంబరాలు లేకుండా సాదాసీదాగా చేసుకున్న వివాహం నెట్టింటా వైరల్ గా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో చౌటుప్పల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఐఏఎస్ శ్రీకాంత్ రెడ్డి, ఐపీఎస్ శేషాద్రిని రెడ్డిలు రిజిస్టర్ వివాహం చేసుకున్నారు.ఉన్నత హోదాల్లో ఉండి కూడా అనవసర ఖర్చులకు తావివ్వకుండా నిరాడంబరంగా వివాహం చేసుకోవడంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
కడప జిల్లాకు చెందిన ట్రైనీ ఐఏఎస్ శ్రీకాంత్ రెడ్డి, కుత్బుల్లాపూర్ డీసీపీగా విధులు నిర్వహిస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లింగారెడ్డిగూడెంకు చెందిన ఐపీఎస్ శేషాద్రినిలు ఎలాంటి ఆర్భాటాలు లేకుండా రిజిస్టర్ పెళ్లి చేసుకోవడం ఆదర్శనీయంగా నిలిచింది. వారిద్దరి వివాహానికి పలువురు ఉన్నతాధికారులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. వారి సమక్షంలో పరస్పరం దండలు మార్చుకుని రిజిస్ట్రార్ సమక్షంలో సంతకాలు చేసి చట్టబద్దంగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. లక్షలాది రూపాయల ఖర్చులతో ఆడంబరాలు, విందు వినోదాలతో పెళ్లిళ్లు చేసుకుంటున్న నేతి తరం యువతకు భిన్నంగా ఉన్నత హోదాలో ఉండి ఆర్థిక స్థోమత ఉన్నా కూడా యువతకు ఆదర్శంగా నిలిచేలా ఉన్నతాధికారులు ఇద్దరు రిజిస్ట్రార్ పెళ్లి చేసుకోవడం అందరి ప్రశంసలు అందుకుంటోంది.
ఇవి కూడా చదవండి :
Jaydeep Gohil Underwater Stunts | నీటి అడుగున విన్యాసాల సాహసం..వీడియో వైరల్
Nampally Fire Accident : నాంపల్లి ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం
