విధాత,హైదరాబాద్ : హైదరాబాద్ నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బచ్చా క్రిస్టల్ ఫర్నిచర్ షాపులో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. నాలుగు అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో అగ్నిప్రమాదం సంభవించి భవనం మొత్తం మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది 4 ఫైరింజన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదంలో ఓ మహిళ, ఇద్దరు చిన్నారులు, మరో ముగ్గురు మంటల్లో చిక్కుకున్నారు. తమ పిల్లలు ఎలా ఉన్నారోనంటూ భవనం భయట తల్లిదండ్రులు రోధిస్తున్న దృశ్యం అందరిని కలిచివేసింది.
హైదరాబాద్ సీపీ సజ్జనార్ సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. మంటలు, పొగ దట్టంగా అలుముకోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. రోబోను భవనంలోకి పంపి మంటలను ఆర్పేందుకు చర్యలు చేపట్టారు.
నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం
ఫర్నీచర్ షాపులో అగ్నిప్రమాదం.. భారీగా చెలరేగుతున్న మంటలు
భవనంలో ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం
ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్న నాలుగు ఫైర్ ఇంజన్లు
ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్న సీపీ సజ్జనార్ pic.twitter.com/GYdod0fMgG
— Telugu Scribe (@TeluguScribe) January 24, 2026
ఇవి కూడా చదవండి :
Horse Playing In Ocean : సముద్రపు అలలపై గుర్రం సయ్యాట..వీడియో చూస్తే పులకింత
Telangana Cabinet Expansion | మున్సిపోల్స్ తర్వాత ముగ్గురు మంత్రులపై వేటు? తాజా పరిణామాలు ఆ దిశగానే!
