Horse Playing In Ocean : సముద్రపు అలలపై గుర్రం సయ్యాట..వీడియో చూస్తే పులకింత

తొలిసారి సముద్ర జలాలను చూసి, జలకళాటంలో పాల్గొన్న గుర్రం వీడియో నెట్టింటా వైరల్ అయ్యింది.

Baby Horse Playing in Ocean Waves

విధాత: జంతువుల్లో గుర్రం, ఏనుగులు తెలివైనవి అంటుంటారు. మానవులకు మచ్చిక కావడంలో అవి తెలివిగా స్పందిస్తుంటాయి.అయితే పర్వత ప్రాంతాలు, పచ్చిక బయళ్లు, నది తీరాలు, పలు రకాల అటవీ ప్రాంతాలలో విభిన్న వాతావరణాల్లో జీవించే గుర్రాలు అక్కడి స్థానిక
పరిస్థితులను అనుసరించి వాటి మనుగడ సాగిస్తుంటాయి.ఓ నాలుగు నెలల గుర్రం తొలిసారిగా సముద్ర జలాలను చూసిన సందర్బంలో దానిలోని విభిన్న స్పందనలు, ఆశ్చర్యానందాలతో కూడిన చర్యలతో కూడిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.

సముద్ర జలాలను చూసిన గుర్రం సముద్ర కెరటాలు ముందు వెనక్కి వస్తూ పోతుంటే.. కెరటాల కదలికలకు విస్మయం చెందుతూ గుర్రం కూడా ముందు వెనక్కి గంతులేస్తూ..పరుగెత్తుతు అశ్చర్యానందాలతో పరవశించింది. కెరటాల కదలికలను అర్ధం చేసుకున్నా తర్వాత గుర్రం మెల్లగా సముద్ర జలాల్లోకి దిగి నీటిలో కేరింతలు కొట్టింది. తొలిసారిగా సముద్ర జలాల అనుభవాన్ని చూసిన గుర్రం..సముద్ర కెరటాల కదలికలను పరిశీలించి అర్ధం చేసుకున్నాక సందేహాలు తీరిపోయాక వాటిలో జలక్రీడలు సాగించడం చూస్తే..చిన్న పిల్లలు నీటిలో కేరింతలు కొట్టినట్లుగా అనిపించింది. సముద్ర జలాల్లో గుర్రం జలకలాటల వీడియోకు నెటిజన్లు ఫిదా అవుతుండటంతో ఈ వీడియో వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి :

Vehicle Registration | నేటి నుంచి షోరూమ్ లోనే వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్స్
Gold, Silver Price Increas| వెండి జోరు.. 24రోజుల్లో రూ.1లక్ష 4వేలు పెరుగుదల

Latest News