Site icon vidhaatha

Elephant vs Horse | గుర్రం దెబ్బ‌కు ఏనుగు ప‌రార్.. వైర‌ల్ వీడియో

Elephant vs Horse | గ‌జ‌రాజు( Elephant )ను చూడ‌గానే గ‌జ‌గ‌జ వ‌ణికిపోతాం.. అది ఒక్క‌సారి దాడి చేయ‌డం మొద‌లు పెట్టిందంటే.. పెద్ద పెద్ద ఆవాసాల‌ను ధ్వంసం చేయ‌గ‌ల సామ‌ర్థ్యం దాని సొంతం. మ‌న‌షుల‌ను కూడా ఏనుగుల‌ను చంపేసిన ఘ‌ట‌న‌లు అనేకం చూశాం. కానీ ఈ ఏనుగు మాత్రం గుర్రం( Horse ) చేతిలో ఓడిపోయింది. గుర్రం దాడి త‌ట్టుకోలేక ఏనుగు త‌ప్పించుకుని అక్క‌డ్నుంచి ప‌రారైంది. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది.

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌( Madhya Pradesh )లోని రాట్లం( Ratlam ) సిటీలోని ఓ ర‌హ‌దారిపైకి భారీ గ‌జ‌రాజు ఎక్కే క్ర‌మంలో.. దాని వెనుకాలే ఉన్న ఓ తెలుపు రంగు గుర్రం మెరుపు వేగంతో దాడి చేసింది. ఏనుగును త‌న నోటితో క‌రిచి దాడి చేసేందుకు య‌త్నించింది. ఏనుగు గుర్రంపై తిరిగి దాడి చేసేందుకు య‌త్నించింది.. కానీ సాధ్యం కాలేదు. ఏనుగు మావ‌టి కూడా గుర్రాన్ని ఎదిరించే ప్ర‌య‌త్నం చేశాడు. చివ‌ర‌కు గుర్రం దెబ్బ‌కు ఏనుగే ప‌రారైంది. అయినా కూడా ఆ గుర్రం ఏనుగును వెంటాడింది. గుర్రాన్ని ప‌ట్టుకునేందుకు స్థానికులు య‌త్నించారు.

ఈ ఘ‌ట‌న‌లో స్థానికులు ఎవ‌రికీ గాయాలు కాలేదు. ఏనుగుపై గుర్రం దాడి చేస్తున్న క్ర‌మంలో అక్క‌డున్న వారంతా భ‌యాందోళ‌న‌కు గురై ప‌రుగులు పెట్టారు. అయితే గుర్రం ఏనుగుపై దాడి చేయడానికి గ‌ల కార‌ణాలు తెలియరాలేదు.

Exit mobile version