సరికొత్త బైక్‌ను లాంచ్‌ చేయబోతున్న హోండా..! బైక్‌ ఫీచర్స్‌, లాంచ్‌ డేట్‌ వివరాలు ఇవే..!

దేశీయ ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ హోండా సరికొత్త బైక్‌ను లాంచ్‌ చేయబోతున్నది

  • Publish Date - November 14, 2023 / 05:04 AM IST

దేశీయ ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ హోండా సరికొత్త బైక్‌ను లాంచ్‌ చేయబోతున్నది. ఈ బైక్‌ను సీబీ1000 హార్నెట్​ పేరు పెట్టింది. ఈ మోడల్‌ బైక్‌ను 2023 ఈఐసీఎంఏ ఈవెంట్​లో కంపెనీ ఆవిష్కరించింది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న సీబీ1000ఆర్​ నియో స్పోర్ట్​ కేఫ్​ని ఈ సీబీ1000 హార్నెట్​తో రీప్లేస్‌ చేయబోతున్నది. ఈ బైక్‌ డిజైన్‌ బోల్డ్‌గా, ఆకర్షణీయంగా ఉన్నది. డుకాటీ స్ట్రీట్‌ ఫైటర్‌ జెట్‌ డిజైన్‌ను పోలినట్టు ఉంటుంది.


ఇందులో ఫుల్​ ఎల్​ఈడీ హెడ్​లైట్​, రెసెస్డ్​ ఫ్యూయెల్​ ట్యాంక్‌ ఉండగా.. టెయిల్​ సెక్షన్​.. సీబీ1000ఆర్‌ను పోలి ఉంది. బైక్‌లో 999 సీసీ, లిక్విడ్​ కూల్డ్​, 16 వాల్వ్​, ఇన్​ లైన్​ 4 సిలిండర్​ ఇంజిన్​ ఉంటుంది. 150 హెచ్​పీ పవర్​ని జనరేట్​ చేయనున్నది. బైక్​ సస్పెన్షన్స్​ కోసం ఫ్రెంట్​లో షోవా ఇన్​వర్టెడ్​ ఫోర్క్స్​ని, రేర్​లో ప్రో-లింక్​ మోనో షాక్​ యూనిట్స్‌ను ఉపయోగించారు. హోండా ఈ బైక్‌లో సరికొత్త టెక్నాలజీని వాడుతున్నది.


సీబీ1000 హార్నెట్​లో రైడ్​ బైవైర్‌ సిస్టమ్‌తో పాటు 5 ఇంచ్​ ఫుల్​ కలర్​ టీఎఫ్​టీ స్క్రీన్​, 5 రైడింగ్​ మోడ్స్‌ ఉండనున్నాయి. ఈ మోడల్‌ వచ్చే ఏడాది లాంచ్‌ అయ్యే అవకాశాలున్నాయి. బిగ్‌వింగ్‌ డీలర్‌షిప్‌ ద్వారా ఈ బైక్‌ సేల్స్‌ జరుగనున్నట్లు కంపెనీ పేర్కొంది. అయితే, ఈ ప్రీమియం బైక్‌ ధర.. భారత్‌లో ఎప్పుడు లాంచ్‌ అవుతుంది? ఫీచర్స్‌, మైలేజ్‌ ఎంత ఇస్తుంది? తదితర వివరాలు తెలియాల్సి ఉంది. దీనిపై ఇంకా కంపెనీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.