Tax | ఎన్ఆర్ఐలు ఎంత డబ్బు పంపితే ట్యాక్స్ పడదు? ట్యాక్స్ మినహాయింపు ఎవరికి?

Tax | విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నవారు లేదా ఎన్ఆర్ఐ( NRI )లు స్వదేశంలో ఉన్న తమ కుటుంబసభ్యులకు, బంధువులు, లేదా స్నేహితులకు డబ్బులు లేదా గిఫ్ట్( Gift ) లు పంపే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. నిబంధనలు పాటించకపోతే ఐటీ శాఖ( Income Tax ) నుంచి నోటీసులు రావచ్చు. నిబంధనలను పాటించకపోతే ఫైన్ కూడా విధించవచ్చు. ఇలాంటి వాటి నుంచి ఎలా మినహాయింపు పొందవచ్చో తెలుసుకుందాం.

Tax | విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నవారు లేదా ఎన్ఆర్ఐ( NRI )లు స్వదేశంలో ఉన్న తమ కుటుంబసభ్యులకు, బంధువులు, లేదా స్నేహితులకు డబ్బులు లేదా గిఫ్ట్( Gift ) లు పంపే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. నిబంధనలు పాటించకపోతే ఐటీ శాఖ( Income Tax ) నుంచి నోటీసులు రావచ్చు. నిబంధనలను పాటించకపోతే ఫైన్ కూడా విధించవచ్చు. ఇలాంటి వాటి నుంచి ఎలా మినహాయింపు పొందవచ్చో తెలుసుకుందాం.

ఎన్ఆర్ఐగా ఎలా గుర్తిస్తారు?

ఎన్ఆర్ఐ అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్( Non Resident Indian ). భారతదేశం వెలుపల ఉన్న భారతీయ పౌరుడు లేదా భారత సంతతికి చెందిన వ్యక్తిని నాన్ రెసిడెంట్ ఇండియన్ ఎన్ఆర్ఐ( NRI ) అని పిలుస్తారు. భారతదేశం వెలుపల ఉన్న ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని వెంటనే ఎన్ఆర్ఐగా పరిగణిస్తారు. ఒక ఆర్థిక సంవత్సరంలో 182 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం విదేశాల్లో నివసించేవారిని ఎన్ఆర్ఐగా గుర్తిస్తారు. లేదా ఒక వ్యక్తి గత సంవత్సరంలో 240 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం విదేశాల్లో ఉంటే ఎన్ఆర్ఐగా గుర్తిస్తారు.

ఎన్ఆర్ఐ గిఫ్ట్ డీడ్ అంటే ఏంటి?

బహుమతులపై భారత ప్రభుత్వం 1958లో పన్నును ప్రవేశపెట్టింది. బహుమతులు ఇవ్వడం, స్వీకరించడంపై పన్నులు విధించడం దీని ఉద్దేశం. ఎన్ఆర్ఐ గిఫ్ట్ డీడ్( NRI Gift Deed ) కూడా ఇలా అమల్లోకి వచ్చిందే. 1908 రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 17 ప్రకారం దీన్ని అమలు చేస్తున్నారు. ఎన్ఆర్ఐ గిఫ్ట్ డీడ్ అనేది బహుమతి ఇచ్చేవారికి, తీసుకొనే వారికి మధ్య ఒక అధికారిక ఒప్పందం… దీన్ని స్టాంప్ పేపర్ పై ముద్రించాలి. గిఫ్ట్ డీడ్ పై రెండు పార్టీలు సక్రమంగా సంతకం చేయాలి. ఎన్ఆర్ఐలు ఇండియాలోని కుటుంబ సభ్యులు, బంధువులు, బంధువులు కాని వారికి ఆస్తులను బదిలీ చేయడానికి ఈ గిఫ్ట్ డీడ్ వీలు కల్పిస్తుంది. ఈ డీడ్ అధికారికంగా బదిలీని డాక్యుమెంట్ చేస్తుంది. ఎన్ఆర్ఐ, గిఫ్ట్ గ్రహీతను గుర్తిస్తుంది. స్టాంప్ పేపర్ పై తగిన స్టాంప్ డ్యూటీ చెల్లించి డ్రాఫ్ట్ చేయాలి. దాత, గ్రహీత ఇద్దరూ దానిని చెల్లుబాటు అయ్యేలా పత్రంపై సంతకం చేయాలి. ఇది బహుమతి చట్టబద్దతను నిర్ధారిస్తుంది.

ఎన్ఆర్ఐలు పంపే గిఫ్ట్‌పై ట్యాక్స్ ఎంత?

ఎన్ఆర్ఐలు స్వదేశంలో ఉన్న వారికి ఆస్తులు లేదా డబ్బును గిఫ్ట్ గా ఇస్తే ట్యాక్స్ విధిస్తారు. బంధువులు కానీ వారికి 50 వేల రూపాయాలు పంపితే ఎలాంటి పన్ను ఉండదు. 50 వేలు దాటితే పన్ను విధిస్తారు. ఇక స్థిరాస్తులకు సంబంధించి కూడా స్టాంప్ డ్యూటీ 50 వేల రూపాయాల లోపు స్టాంప్ డ్యూటీ ఉంటే ఎలాంటి పన్ను ఉండదు. 50 వేల రూపాయాలపైగా స్టాంప్ డ్యూటీ ఉంటే ట్యాక్స్ ఉంటుంది. చర ఆస్తులకు సంబంధించి కూడా ఇదే రకంగా పన్ను విధిస్తారు. 50 వేల లోపు ఉంటే ఎలాంటి ట్యాక్స్ ఉండదు. 50 వేలు దాటితే ట్యాక్స్ విధిస్తారు. గిఫ్ట్ డీడీ ఇచ్చిన సమయంలో ఆస్తుల రకాలు, ఎన్ఆర్ఐతో సంబంధం వంటి వాటి ఆధారంగా పన్ను చెల్లిస్తారు. అయితే ఎన్ఆర్ఐలకు బంధువులుగా ఎవరిని పరిగణిస్తారనేది కూడా కీలకం. తల్లిదండ్రులు, తోబుట్టువులు, జీవిత భాగస్వామి, వారసులను ఈ చట్టం కింద బంధువులుగా పరిగణిస్తారు.బంధువులకు ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది. ఇతరులకు మాత్రం పన్ను చెల్లించాలి.

నియమాలు ఏంటి?

భారతీయ పన్ను చట్టం ప్రకారం ఎన్ఆర్ఐ గిఫ్ట్ డీడ్ లావాదేవీలకు కొన్ని నిబంధనలున్నాయి. ఎన్ఆర్ఐలు ఒక ఆర్ధిక సంవత్సరంలో బహుమతి కింద తమ బంధువులకు 2,50,00 డాలర్లను పంపవచ్చు. నగదు బహుమతి రెండు లక్షలలోపే. అంతకుమించి నగదు బహుమతి పంపితే ఫైన్ విధిస్తారు. గిఫ్ట్ డీడ్‌ల ద్వారా వ్యవసాయ భూమి, ఫామ్ హౌస్ లేదా తోటలను పొందలేరు. విదేశాల నుంచి వచ్చే డబ్బు ఫెమా, ఆదాయ పన్ను చట్టం నిబంధనలకు కట్టుబడి ఉండాలి. విహహ సమయంలో ఇచ్చే ఆస్తులు లేదా డబ్బుకు పన్ను విధించరు.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ఎన్ఆర్ఐ గిఫ్ట్ డీడ్ లావాదేవీలు చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్యుమెంటేషన్ పై ఫోకస్ పెట్టాలి. దాత, గ్రహీత ఇద్దరికి చెందిన బ్యాంకు రసీదులు, పన్ను ఫారాలు, గిఫ్ట్ డీడ్ తో సహా అన్ని డాక్యుమెంట్లు, పత్రాలను తమ వద్ద ఉంచుకోవాలి. బహుమతి తీసుకుంటున్న లేదా స్వీకరిస్తున్న వారు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే సమయంలో తమకు వచ్చిన పెద్ద బహుమతులను నమోదు చేయాలి. అంటే ఏడాదికి 50 వేల కంటే ఎక్కువ నగదు లేదా ఆస్తులు పొందితే వాటిని నమోదు చేయించాలి.