హైదరాబాద్ ఏప్రిల్ 10( విధాత): గల్ఫ్ కార్మికుల సంక్షేమం, భద్రత, ఎన్ ఆర్ ఐ సమగ్ర పాలసీ రూపకల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
రిటైర్డ్ ఐ ఎఫ్ ఎస్ అధికారి బి ఎం వినోద్‌కుమార్ చైర్మన్, మందభీమ్ రెడ్డి వైస్ చైర్మన్‌గా ఏర్పాటు అయిన ఈ కమిటీలో మాజీ ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి, ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, ఆర్. భూపతిరెడ్డి, మినరల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ ఈరపతి అనిల్ కుమార్‌లు గౌరవ సభ్యులుగా సింగిరెడ్డి నరేశ్‌రెడ్డి, లిజి జోషఫ్, చెన్నమనేని శ్రీనివాస్‌రావు, కొట్టాల సత్యం నారా గౌడ్ దుబాయ్, గుగ్గిల్ల రవీందర్, నంగి దేవేందర్, స్వదేశ్ పరికి పండ్ల లను సభ్యులుగా ప్రభుత్వం కమిటీని నియమించింది. ఈ కమిటీ కాల పరిమితి రెండేళ్లు.