హైదరాబాద్‌లో ICICI బ్యాంక్ 260వ బ్రాంచ్ ప్రారంభం

: ICICI బ్యాంక్ హైదరాబాద్‌లో మరో బ్రాంచ్‌‌ను ప్రారంభించింది. నానక్‌రామ్‌గూడ, మైస్కేప్ రోడ్డులో తన కొత్త బ్రాంచ్‌ను ప్రారంభించింది. ఇది నగరంలో 260వ బ్రాంచ్ కావడం విశేషం. పీఎన్‌పీ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పి.వి.ఆర్. రాజేంద్ర ప్రసాద్ ఈ శాఖను లాంఛనంగా ప్రారంభించారు.

హైదరాబాద్: ICICI బ్యాంక్ హైదరాబాద్‌లో మరో బ్రాంచ్‌‌ను ప్రారంభించింది. నానక్‌రామ్‌గూడ, మైస్కేప్ రోడ్డులో తన కొత్త బ్రాంచ్‌ను ప్రారంభించింది. ఇది నగరంలో 260వ బ్రాంచ్ కావడం విశేషం. పీఎన్‌పీ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పి.వి.ఆర్. రాజేంద్ర ప్రసాద్ ఈ శాఖను లాంఛనంగా ప్రారంభించారు. ఈ బ్రాంచ్‌లో ఏటీఎం సౌకర్యం కూడా అందుబాటులో ఉందని బ్రాంచ్ సిబ్బంది వెల్లడించింది. విస్తృత శ్రేణి బ్యాంకింగ్ సేవలు, అకౌంట్లు, డిపాజిట్లు: సేవింగ్స్ , కరెంట్ అకౌంట్లు (గిఫ్ట్ సిటీ అకౌంట్లతో సహా), డీమ్యాట్ , ట్రేడింగ్ అకౌంట్లు, ఫిక్స్‌డ్ , రికరింగ్ డిపాజిట్లు చేసుకోవచ్చని వెల్లడించారు.
రుణాలు: హోమ్ లోన్, ఆస్తిపై రుణం (లోన్ అగైనెస్ట్ ప్రాపర్టీ), పర్సనల్ లోన్, ఆటో లోన్, బిజినెస్ లోన్, గోల్డ్ లోన్, ఎడ్యుకేషన్ లోన్.
ఇతర సేవలు: ఫారెక్స్ సేవలు, కార్డ్ సేవలు, ప్రైవేట్ బ్యాంకింగ్, ఫ్యామిలీ ఆఫీస్ సొల్యూషన్స్, ఎన్ఆర్ఐ కస్టమర్ల కోసం బ్యాంకింగ్ సొల్యూషన్స్.

ప్రత్యేక సౌకర్యాలు: సీనియర్ సిటిజన్స్‌కు వ్యక్తిగత సహాయం అందించడానికి ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేశారు. వీల్‌చైర్ సౌలభ్యం ఉంది.
లాకర్ రూమ్స్: వినియోగదారుల సౌలభ్యం కోసం రెండు లాకర్ రూమ్ సౌకర్యాలు కల్పించారు.

ట్యాబ్ బ్యాంకింగ్: ఉద్యోగి ట్యాబ్లెట్ పరికరం ద్వారా ఖాతా తెరవడం, ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డి) తెరవడం, చెక్ బుక్ రిక్వెస్ట్, ఈ-స్టేట్‌మెంట్ల జనరేషన్, చిరునామా మార్పు వంటి సుమారు 100 సేవలను వినియోగదారుడి వద్దనే అందించే ట్యాబ్ బ్యాంకింగ్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది.

పని వేళలు: ఈ బ్రాంచ్ సోమవారం నుండి శుక్రవారం వరకు , నెలలోని మొదటి, మూడవ, ఐదవ శనివారాలలో ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 3:00 గంటల వరకు పనిచేస్తుంది.

తెలంగాణలో ఐసీఐసీఐ బ్యాంక్‌కు 370కి పైగా శాఖలు, 630కి పైగా ఏటీఎంలు, క్యాష్ రీసైక్లింగ్ యంత్రాలు (సీఆర్‌ఎంలు) ఉన్నాయి.