Cool Drinks | గడప దాటితే చల్లగా గొంతులో పడాల్సిందే..! ఈ ఏడాదిలో భారత్‌లో 721కోట్ల లీటర్ల కూల్‌డ్రింక్స్‌ అమ్మకాలు

Cool Drinks | గడప బయట కాలుపడితే గొంతులో చల్లటి కూల్‌డ్రింక్‌ గొంతులోపడాల్సిందే. ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినా టీ, కాఫీల తర్వాత ఎక్కువగా ఇచ్చేది కూల్‌డ్రింక్‌ మాత్రమే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూల్‌డ్రింక్స్‌ వాడకం భారీగా పెరిగింది.

  • Publish Date - July 3, 2024 / 11:00 AM IST

  • స్టాటిస్టా గణాంకాలు వెల్లడి

  • కూల్‌డ్రింక్స్‌ హెల్త్‌కి మంచివి కాదుంటున్న ఆరోగ్య నిపుణులు

 

Cool Drinks | గడప బయట కాలుపడితే గొంతులో చల్లటి కూల్‌డ్రింక్‌ గొంతులోపడాల్సిందే. ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినా టీ, కాఫీల తర్వాత ఎక్కువగా ఇచ్చేది కూల్‌డ్రింక్‌ మాత్రమే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూల్‌డ్రింక్స్‌ వాడకం భారీగా పెరిగింది. ప్రతి సంవత్సరం కూల్‌డింక్స్‌ విక్రయాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. అయితే, స్టాటిస్టా గణాంకాలు ప్రకారం.. ఈ ఏడాది కూల్‌డ్రింక్‌ విక్రయాలు ఏకంగా 721 కోట్లకు పెరుగబోతున్నాయని అంచనా. సంస్థ గత పది సంవత్సరాల్లో ఎన్ని కోట్ల లీటర్లు తాగారు.. రాబోయే మూడేళ్లలో ఎంత తాగబోతున్నారో అంచనా వేసింది. గణాంకాలను పరిశీలిస్తే.. 2014లో 561 కోట్ల లీటర్లు తాగినట్లు పేర్కొంది. 2015లో 590కోట్లు, 2016లో 606కోట్లు, 2017లో 649 కోట్లు, 2018లో 663 కోట్ల లీటర్లు తాగేశారని చెప్పింది. 2019లో 682కోట్లు, 2020లో 626 కోట్లు, 2021లో 668 కోట్లు, 2022లో 675 కోట్లు, 2023లో 694 కోట్లు తాగినట్లు తెలిపింది. ఇక ఈ ఏడాది 2024లో 721 కోట్ల లీటర్లు తాగే అవకాశం ఉందని పేర్కొంది. ఇక ఇది వచ్చే ఏడాది నాటికి 744 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. 2026 నాటికి 766 కోట్లకు.. 2027 వరకు 782 కోట్ల లీటర్లకు చేరే అవకాశాలున్నాయని స్టానిస్టా అంచనా వేసింది.

అయితే, ప్రస్తుత కాలంలో చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అంతా కూల్‌డ్రింక్‌ తెగ తాగేస్తున్నారు. అయితే, కూల్‌డ్రింక్స్‌ ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు పేర్కొటున్నారు. వాటితో ఎలాంటి ఉపయోగం ఉండదని.. కేవలం బరువును పెంచడం తప్ప మరో ప్రయోజనం లేదని పేర్కొంది. దీనిపై హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అధ్యయనం సైతం నిర్వహించింది. కూల్ డ్రింక్స్ తాగే పురుషులకు గుండెజబ్బులు వచ్చే ప్రమాదం 20శాతం వరకు పెరుగుతుందని.. బరువు పెరగడంతో ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. వాస్తవానికి ఎముకల పెరుగడానికి ఫాస్పరస్ కీలకమైంది. అయితే తక్కువ సీరం ఫాస్పేట్ స్థాయిలు మాత్రం పోషకాహార లోపాలను సూచిస్తాయి. బోలు ఎముకలు, ఎముకల పగుళ్లు లాంటి ప్రమాదాలకు కూల్ డ్రింక్స్ దారి తీస్తాయని చెబుతున్నారు హెచ్చరిస్తున్నాయి. అతిగా తీసుకోవడం వల్ల ప్రొటీన్‌ లోపం వస్తుందని పేర్కొంటున్నారు. వీటికి బదులుగా పండ్ల రసాలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Latest News