Ambali cart Business Idea | అంబలి కార్ట్‌తో లక్షల ఆదాయం… మన్జు జీవితాన్ని మార్చిన అమ్మ మాట

పెద్ద పెద్ద బిజినెస్ స్కూల్స్‌, మోటివేషనల్ పుస్తకాలు మాత్రమే జీవితాన్ని మార్చే ఐడియాలు ఇస్తాయనుకుంటే పొరపాటే. కొన్నిసార్లు సాధారణ ఇంటి వంటగది నుంచే పెద్ద పెద్ద ఆలోచనలు మార్పులు సంభవిస్తాయి.

పెద్ద పెద్ద బిజినెస్ స్కూల్స్‌, మోటివేషనల్ పుస్తకాలు మాత్రమే జీవితాన్ని మార్చే ఐడియాలు ఇస్తాయనుకుంటే పొరపాటే. కొన్నిసార్లు సాధారణ ఇంటి వంటగది నుంచే పెద్ద పెద్ద ఆలోచనలు మార్పులు సంభవిస్తాయి. దీనికి నిదర్శనం మైసూరుకు చెందిన మన్జు జీవితం. అమ్మ ఇమ్మ చెప్పిన ఒక్క ఐడియా అతని జీవితాన్ని మార్చివేసింది.  మైసూరుకు చెందిన మన్జు బీఏ పూర్తి చేసి బ్యాంకులో మంచి ఉద్యోగం సంపాదించాడు. నెలకు రూ.30 నుంచి 40 వేల వరకు జీతం వచ్చేది. కానీ, ఉద్యోగంలో పనిభారం మాత్రం విపరీతంగా ఉండేది. సెలవులు లేకుండా కఠినమైన టార్గెట్లు ఉండడం కుటుంబంతో గడిపేందుకు టైం ఉండేది కాదు. జీతం ఉన్నా జీవితంలో మన్జుకు ఆనందం లేకుండా పోయింది. ఏదైనా బిజినెస్‌ మొదలు పెడదామనుకున్నా… ఏం చేయాలనే గందరగోళం నెలకొంది. కొత్త ఐడియాలు వచ్చినా వాటిని ప్రాక్టికల్ గా అమలు చేయాలేకపోయాడు.

జీవితాన్ని మార్చిన ‘అంబలి’ ఆలోచన..

మన్జు ఇబ్బందులు చూస్తున్న అతని తల్లి. ఒకరోజు అతనికి ఊహించని ఐడియా ఇచ్చింది. తను ఇంట్లో ఏండ్లుగా చేసే సాధారణ వంటకం అంబలిని తయారు చేసి అమ్మమని చెప్పింది. రాగి, మజ్జిగతో చేసే అంబలి… పాత కాలంలో పేదవాడి పానీయంగా ఉండేది. కానీ ఇప్పుడు కెమికల్స్‌ లేని సహజ ఆహారం మీద మళ్లీ ప్రజలు మొగ్గు చూపుతున్నారు. పోషకంగా, ఆరోగ్యకరంగా ఉండే అంబలికి ప్రస్తుతం డిమాండ్‌ పెరుగుతోంది. అయితే, అమ్మ మాట మన్జుకి మొదట సీరియస్‌గా అనిపించలేదు. కానీ… అమ్మ నమ్మకం అతడిని ఒక్కసారైనా ప్రయత్నించమని ప్రేరేపించింది.

రూ.300 తో ప్రారంభమైన వ్యాపారం

రెండో రోజు ఉదయం మన్జు జేబులో ఉన్న రూ.300 తీసుకుని మొదటి అడుగు వేసాడు. రూ.25కి పుష్కార్ట్‌ అద్దెకు తీసుకుని మైసూరు కుక్కరహಳ್ಳಿ రైల్వే గేట్‌ దగ్గర తన అంబలి కార్ట్ నిలిపి.. అమ్మ చేసిన విధంగా అచ్చం అదే రుచితో అంబలి తయారు చేశాడు. గ్లాస్‌ను రూ.20కి అమ్మడం ప్రారంభించారు. మట్టికుండ, రాగి రంగు, సహజమైన సెటప్ ఇవి ప్రజల్ని వెంటనే ఆకర్షించింది. అతని బాల్యంలో తాగిన ఆ అంబలి ఈరోజు కూడా విలువైనదే అని మన్జు మధ్యాహ్నానికల్లా  గ్రహించాడు.

సహజమైన పదార్థాలే అతని బ్రాండ్

రోజురోజుకు కస్టమర్లు పెరుగుతుండటంతో తన మెనూలో మరిన్ని ఐటమ్స్‌ పెంచిన మన్జు. ఏది తయారు చేసినా సహజసిద్ధమైన వాటితోనే సిద్ధం చేయాలనే నిబంధన పెట్టుకున్నాడు. మట్టికుండల్లో చల్లటి మజ్జిగ, నిమ్మరసం…ఐస్‌ లేదు. కృత్రిమ రుచులేమీ కలపలేదు.. ఆ నిజాయితీనే మన్జుకు గుర్తింపును తెచ్చిపెట్టింది. దీంతో పాటు రుచి కోసమే కాకుండా పరిశుభ్రత, సహజత్వం, పాతకాలపు రుచితో అతని దగ్గరకు వచ్చే వారి సంఖ్య పెరిగింది.

రోజుకి రూ. 5,000…. నెలకి లక్షలు టర్నోవర్

చిన్నగా మొదలైన వ్యాపారం ఊహించని రీతిలో పెరిగిపోయింది. రోజుకు రూ.5వేలు రాగా అందులో ఖర్చులు పోను రూ.3 నంచి 4వేలు లాభం వచ్చేవి.. ఇలా సంవత్సరం పూర్తయ్యేసరికి మన్జు పుష్‌కార్ట్‌ అతనికి లక్షల సంపాదన తెచ్చిపెట్టింది. కష్టపడి పనిచేస్తే చిన్న పనైనా గొప్పదవుతుంది. ఒకప్పుడు పేదవాడి పానీయమైన అంబలిఇప్పుడు మన్జు జీవితానికి ఆర్థిక స్వాతంత్ర్యం, ప్రశాంతత, గౌరవం తెచ్చిపెట్టింది. సరళమైన ఆలోచన, నిజాయితీ, క్రమశిక్షణ ఉంటే చిన్న పని పెద్ద విజయమే అవుతుంది అని మన్జు జీవితం నేర్పిస్తుంది.

Read Also |

Two WhatsApps for iPhone | ఐఫోన్​ యూజర్లకు శుభవార్త : ఎట్టకేలకు ఐఫోన్​లో రెండు వాట్సప్​లు
Telangana Tourism : 22 నుండి సాగర్ – శ్రీశైలం లాంచీ ప్రయాణం ప్రారంభం
Bad Memories | కలచివేసే చెడు జ్ఞాపకాలను ఇలా తుడిచివేయచ్చు!
Nepal Gen-Z Protest : నేపాల్‌లో మళ్లీ జన్-జడ్ ఆందోళనలు

Latest News