విధాత, హైదరాబాద్ : కర్ణాటక మైసూర్‌లోని స్కై గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షోరూంలో సినీ ఫక్కీలో భారీ దోపిడీ జరిగింది. ఐదు నిమిషాల్లో రూ.10 కోట్ల విలువైన బంగారం, వజ్రాలను దుండగులు ఎత్తుకెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం హున్సూర్‌లోని జ్యువెలరీ షాపులోకి మాస్కులు వేసుకున్న ఐదుగురు దుండగులు ప్రవేశించారు.
తుపాకులతో సిబ్బందిని బెదిరించి షాపులోని ఆభరణాలు, వజ్రాలను దోచుకొని పరారయ్యారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటనపై షోరూం యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దుండగులు పక్కా ప్రణాళికతోనే..ముందస్తు రెక్కీ నిర్వహించి మరి దోపిడీకి పాల్పడినట్లుగా అనుమానిస్తున్నారు. ప్రొఫెషనల్ దొంగలే ఈ దోపడి చేసి ఉంటారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
In a broad daylight heist, a gang of five armed robbers looted gold and diamond jewellery worth nearly Rs 4.5 crore from a showroom near the Hunsur Bus Stand in #Mysuru in #Karnataka on Sunday afternoon.
The robbery took place at Sky Gold and Diamonds between 1.30 pm and 2 pm… pic.twitter.com/G2hRTorehB
— Hate Detector 🔍 (@HateDetectors) December 29, 2025
ఇవి కూడా చదవండి :
US Vlogger Gabruji Emotional Video : ఇండియాను మిస్ అవుతా.. అమెరికా పర్యాటకుడి భావోద్వేగం
INSV Kaundinya : వండర్..ఆ ప్రాచీన నౌక మళ్లీ సముద్రంపై ప్రత్యక్షం
