Viral Video | చాలా మంది రైలు ప్రయాణానికి ఇష్టపడుతారు. ఎందుకంటే రైలు ప్రయాణం చాలా తక్కువ ఖరీదుతో కూడుకున్నది. అంతేకాకుండా కంఫర్టబుల్‌గా జర్నీ చేయొచ్చు. కాబట్టి సుదూర ప్రాంతాలకు వెళ్లే వారు రైలు ప్రయాణానికే మొగ్గు చూపుతుంటారు. ఇలా రైల్లో ప్రయాణించే వారు చాలా జాగ్రత్తగా ఉండాలని రైల్వే శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే.. దోపిడీ దొంగల ఆగడాలు శృతి మించుతున్నాయని తెలిపారు. దోపిడీ దొంగకు సంబంధించిన ఈ వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.
ఓ వృద్ధురాలు మరో మహిళ సహాయంతో వాష్ రూమ్‌కు వెళ్లింది. వారిద్దరిని గమనించిన ఓ దొంగ డోర్ దగ్గరే నిల్చుని ఉన్నాడు. ఇక వారు వాష్‌రూమ్ నుంచి తిరిగి వస్తుండగా, వృద్ధురాలిని వదిలేసి, ఆమె వెనుకాలే ఉన్న మరో మహిళపై దాడి చేశాడు. ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కొని వేగంగా వెళ్తున్న రైల్లో నుంచి కిందకు దూకేశాడు. ప్రయాణికురాలు కూడా రైల్లో కింద పడిపోయింది. ఈ దృశ్యాలు ఆ బోగీలో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
ఈ ఘటన మార్చి 13వ తేదీన రాత్రి 7 గంటల సమయంలో చోటు చేసుకున్నట్లు రైల్వే అధికారులు నిర్ధారించారు. దొంగ ఉద్దేశపూర్వకంగానే బోగీ డోర్ తెరిచి ఉంచి, దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే దొంగ వివరాలు తెలియరాలేదు. దొంగకు ఏమైనా గాయాలయ్యాయా..? రైలు పట్టాలపై పడిపోయాడా..? అనే వివరాలు కూడా తెలియరాలేదు. ఏది ఏమైనప్పటికీ రైల్లో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, అనుమానితులు కనిపిస్తే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
*While traveling in a train be careful* pic.twitter.com/6EDtRiEhXS
— Narayanan R (@rnsaai) March 26, 2024