TG Tenth Exams | తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి వార్షిక పరీక్షలు ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. విద్యార్థులు అర గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. దీంతో ఆయా పరీక్షా కేంద్రాల వద్ద సందడి నెలకొంది. ఇక తల్లిదండ్రులు వారి పిల్లలకు ఆల్ ది బెస్ట్ చెబుతూ పరీక్షా కేంద్రాల్లోకి పంపించారు. ఈ పరీక్షలకు విద్యాశాఖ అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 2,676 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 5,17,727 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. ఇందులో బాలురు 2,60,916 మంది కాగా, బాలికలు 2,56,811 మంది ఉన్నారు. గతంలో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులు 10,512 మంది ఈసారి పరీక్షలు రాస్తున్నారు.
పరీక్షల్లో ఎటువంటి కాపీయింగ్ జరగకుండా ఉండటానికి 144 ఫ్లయింగ్ స్క్వాడ్లను, వాటితో పాటు సిట్టింగ్ స్క్వాడ్లను కూడా నియమించినట్లు అధికారులు ప్రకటించారు.
పది పరీక్షల షెడ్యూల్ ఇదే..
మార్చి 14 – ప్రథమ భాషా పరీక్ష
మార్చి 18 – సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష
మార్చి 23 – థర్డ్ లాంగ్వేజ్
మార్చి 28 – గణితం
ఏప్రిల్ 2 – సైన్సు పార్ట్-1 ఫిజిక్స్
ఏప్రిల్ 7 – బయాలజీ
ఏప్రిల్ 13 – సాంఘిక శాస్త్రం పరీక్ష
ఏప్రిల్ 15 – ఒకేషనల్ కోర్సు (వృత్తివిద్యా కోర్సు) పేపర్-1 భాషా పరీక్ష
ఏప్రిల్ 16 – ఒకేషనల్ కోర్సు (వృత్తి విద్యా కోర్సు) పేపర్-2 లాంగ్వేజ్ పరీక్ష
