Tenth Exams | 14 నుంచి ప‌ది ప‌రీక్ష‌లు.. 5 నిమిషాలు ఆల‌స్య‌మైనా అనుమ‌తి..!

Tenth Exams | రాష్ట్రంలో వార్షిక ప‌రీక్ష‌ల హ‌డావుడి కొన‌సాగుతోంది. ఇంట‌ర్ ప్ర‌థ‌మ‌, ద్వితీయ సంవ‌త్స‌రం ప‌రీక్ష‌లు చివ‌రి ద‌శ‌కు చేరుకున్నాయి. ఇక ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్నాయి.

  • By: raj |    telangana |    Published on : Mar 12, 2026 6:58 AM IST
Tenth Exams | 14 నుంచి ప‌ది ప‌రీక్ష‌లు.. 5 నిమిషాలు ఆల‌స్య‌మైనా అనుమ‌తి..!

Tenth Exams | రాష్ట్రంలో వార్షిక ప‌రీక్ష‌ల హ‌డావుడి కొన‌సాగుతోంది. ఇంట‌ర్ ప్ర‌థ‌మ‌, ద్వితీయ సంవ‌త్స‌రం ప‌రీక్ష‌లు చివ‌రి ద‌శ‌కు చేరుకున్నాయి. ఇక ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 16వ తేదీ వ‌ర‌కు ప‌ది ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ కొన‌సాగ‌నుంది. ఈ నేప‌థ్యంలో పదో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌కు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఐదు నిమిషాలు ఆల‌స్య‌మైనా నో ఎంట్రీ

ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను ఉద‌యం 9.30 నుంచి మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగ‌నున్నాయి. అయితే విద్యార్థులంద‌రూ త‌మ ప‌రీక్షా కేంద్రాల‌కు గంట ముందుగానే చేరుకోవాల‌ని అధికారులు సూచించారు. ఉద‌యం 9.35 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్షా కేంద్రాల్లోకి అనుమ‌తిస్తామ‌న్నారు. ఉద‌యం 9.35 త‌ర్వాత వ‌చ్చే విద్యార్థుల‌కు అనుమ‌తి ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా 2,676 ప‌రీక్షా కేంద్రాలు

ప‌ది పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,676 సెంటర్లు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ బడుల్లో 1,582 సెంటర్లు, ప్రైవేట్‌ బడుల్లో 1,094 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ సారి 5,17,727 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు.

సెల్‌ఫోన్లు నిషేధం.. ఉద్యోగం తొల‌గిస్తాం

కాపీయింగ్ జ‌ర‌గ‌కుండా ఉండేందుకు, గ‌త అనుభావాల దృష్ట్యా.. ప‌దో త‌ర‌గ‌తి త‌ర‌గ‌తి ప‌రీక్షా కేంద్రాల‌ను నో సెల్‌ఫోన్ జోన్లుగా అధికారులు ప్ర‌క‌టించారు. ప‌రీక్షా కేంద్రంలోని సిబ్బంది, స్క్వాడ్ ఎవ‌రూ కూడా సెల్ ఫోన్ల‌ను వినియోగించే అవ‌కాశం లేదు. త‌నిఖీల‌కు వ‌చ్చే అధికారులు కూడా ప‌రీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్ల‌ను తీసుకెళ్ల‌కూడ‌దు అనే నిబంధ‌న‌ను ఉన్న‌తాధికారులు విధించారు. నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వారిని స‌స్పెండ్ చేస్తామ‌ని హెచ్చ‌రించారు. పేప‌ర్ లీకేజీల‌కు పాల్ప‌డితే ఉద్యోగం నుంచి తొల‌గిస్తామ‌ని వార్నింగ్ ఇచ్చారు.

ప‌ది ప‌రీక్ష‌ల‌ షెడ్యూల్‌

మార్చి 14న ఫస్ట్‌ లాంగ్వేజ్‌ (తెలుగు)
మార్చి 18న సెకండ్‌ లాంగ్వేజ్‌ (హిందీ)
మార్చి 23న థర్డ్‌ లాంగ్వేజ్‌ (ఇంగ్లీష్‌)
మార్చి 28న గణితం
ఏప్రిల్‌ 2న భౌతిక శాస్త్రం
ఏప్రిల్‌ 7న జీవశాస్త్రం
ఏప్రిల్‌ 13న సోషల్‌ స్టడీస్‌
ఏప్రిల్‌ 15న OSSC మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ I
ఏప్రిల్‌ 16న OSSC మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ I I