Tenth Exams | సెలవుల జాబితా ప్రకటించని సర్కార్..! ‘పది’ పరీక్షల షెడ్యూల్‌పై సందిగ్ధత..!!
Tenth Exams | హైదరాబాద్ : తెలంగాణ( Telangana )లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ).. ఇప్పటి వరకు కూడా 2026 ఏడాదికి సంబంధించిన సెలవుల జాబితా( Holidays List )ను అధికారికంగా ప్రకటించలేదు. దీంతో పదో తరగతి పరీక్షల( Tenth Exams ) నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌పై సందిగ్ధత నెలకొంది.
Tenth Exams | హైదరాబాద్ : తెలంగాణ( Telangana ) లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ).. ఇప్పటి వరకు కూడా 2026 ఏడాదికి సంబంధించిన సెలవుల జాబితా( Holidays List )ను అధికారికంగా ప్రకటించలేదు. దీంతో పదో తరగతి పరీక్షల( Tenth Exams ) నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌పై సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలో పది పరీక్షల టైం టేబుల్ విషయంలో విద్యా శాఖ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ప్రభుత్వం సెలవుల జాబితాను విడుదల చేస్తే కానీ, టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్‌ను ప్రకటించలేమని వారు పేర్కొన్నారు.
వాస్తవానికి మార్చి 16 లేదా 18 నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని, త్వరలోనే పూర్తి స్థాయి టైం టేబుల్‌ను ప్రకటిస్తామని కొద్ది రోజుల క్రితం విద్యాశాఖ ప్రకటించింది. అయితే 2026 ఏడాదిలో వచ్చే పండుగలు, ఇతర సెలవులకు సంబంధించిన జాబితాను ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ప్రకటించలేదు. మరి ముఖ్యంగా మార్చి, ఏప్రిల్ మాసంలో వచ్చే రంజాన్, శ్రీరామ నవమి పండుగల తేదీలు ప్రకటిస్తేనే.. పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ప్రకటించేందుకు వీలుంటుంది. ఎందుకంటే రంజాన్‌ను మార్చి 20న జరుపుకునే అవకాశం ఉంది. అదే విధంగా శ్రీరామనవమి వేడుకలు మార్చి 26, లేదా 27న ఎప్పుడు నిర్వహిస్తారు అనే విషయంపై స్పష్టత కొరవడింది. ఏపీలో మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకుల నిర్ణయం ప్రకారం మార్చి 27న శ్రీరామనవమి వేడుకలను జరుపుకోనున్నారు. కానీ తెలంగాణలో మాత్రం శ్రీరామనవమి పండుగపై స్పష్టత లేదు.
ఇక ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వం.. రాబోయే కొత్త ఏడాదికి సంబంధించిన సెలవుల జాబితాను నవంబర్ నెల చివరి నాటికే ప్రకటిస్తుంది. కానీ ఈ ఏడాది మాత్రం డిసెంబర్ మొదటి వారం పూర్తవుతున్నప్పటికీ సెలవుల జాబితాను ప్రకటించలేదు.
ఇప్పటివరకు, రెగ్యులర్ విద్యార్థులతో పాటు ఫెయిలైన అభ్యర్థులతో సహా 5.40 లక్షల మంది మార్చి 2026 టెన్త్ పబ్లిక్ పరీక్షలకు నమోదు చేసుకున్నారు. రూ. 200 ఆలస్య రుసుముతో డిసెంబర్ 11వ తేదీ వరకు ఫీజు కట్టొచ్చు. సమయం ఉంది కాబట్టి దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. రూ. 500 ఆలస్య రుసుంతో డిసెంబర్ 29 వరకు అవకాశం కల్పించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram