Sankranthi Holidays | తెలంగాణలో సంక్రాంతికి వారం రోజులు సెలవులు..!
Sankranthi Holidays | తెలంగాణలో సంక్రాంతి పండుగ సెలవులు వారం రోజుల పాటు రానున్నాయి. ఇప్పటికే ప్రకటించిన క్యాలెండర్ ప్రకారం జనవరి 11 నుంచి 15వ తేదీ వరకు ఐదు రోజుల పాటు సెలవులు రానున్నాయి.
Sankranthi Holidays | హైదరాబాద్ : తెలంగాణలో సంక్రాంతి పండుగ సెలవులు వారం రోజుల పాటు రానున్నాయి. ఇప్పటికే ప్రకటించిన క్యాలెండర్ ప్రకారం జనవరి 11 నుంచి 15వ తేదీ వరకు ఐదు రోజుల పాటు సెలవులు రానున్నాయి. తాజాగా ప్రభుత్వం 14న భోగి, 15న సంక్రాంతి, 16న కనుమ పండుగా పేర్కొంది. జనవరి 10 రెండో శనివారం కూడా కలిసి రావడంతో.. ముందు ప్రకటించిన సెలవులన్ని పునఃసమీక్షించారు. జనవరి 10 నుంచి 16వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వాలని నిర్ణయించారు. జనవరి 17న తిరిగి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ సంక్రాంతి సెలవులపై త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల కానుందని విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram