Humans as Guests | అక్క‌డ మ‌నుషులు అథితులే..! జంతువుల‌దే ఆధిప‌త్యం..!!

Humans as Guests | ఈ భూమ్మీద చాలా దేశాలు, చాలా ప్రాంతాలు మానవ చ‌రిత్ర‌, ప‌ర్యాట‌కం, అభివృద్ధి ద్వారా గుర్తింపు పొందాయి. కానీ కొన్ని ప్రాంతాలు జంతువుల( Animals ) ద్వారా గుర్తింపు పొందుతున్నాయి. అలా కొన్ని భిన్న‌మైన ద్వీపాలు( Islands ) ఉన్నాయి. ఆ ద్వీపాల్లో.. అంటే ఆ భూభాగంలో మ‌నుషులు కేవ‌లం అతిథులు( Humans as Guests ) మాత్ర‌మే. జంతువుల‌దే ఆధిప‌త్యం ఉంటుంది.

Humans as Guests | అక్క‌డ మ‌నుషులు అథితులే..! జంతువుల‌దే ఆధిప‌త్యం..!!

Humans as Guests | ఈ భూమ్మీద చాలా దేశాలు, చాలా ప్రాంతాలు మానవ చ‌రిత్ర‌, ప‌ర్యాట‌కం, అభివృద్ధి ద్వారా గుర్తింపు పొందాయి. కానీ కొన్ని ప్రాంతాలు జంతువుల( Animals ) ద్వారా గుర్తింపు పొందుతున్నాయి. అలా కొన్ని భిన్న‌మైన ద్వీపాలు( Islands ) ఉన్నాయి. ఆ ద్వీపాల్లో.. అంటే ఆ భూభాగంలో మ‌నుషులు కేవ‌లం అతిథులు( Humans as Guests ) మాత్ర‌మే. జంతువుల‌దే ఆధిప‌త్యం ఉంటుంది. ఇది మీకు విన‌డానికి విచిత్రంగా ఉండొచ్చు.. కానీ వందకు వంద శాతం నిజం.

ఆయా ప్రాంతాల్లో మ‌నుషుల‌ను జంతువులు డామినేట్ చేస్తున్నాయి. మాన‌వ జ‌నాభా కంటే జంతువుల జ‌నాభానే ఎక్కువ‌గా ఉంద‌న‌డంలో సందేహం లేనే లేదు. ఇంట్లో స్నేహ‌పూర్వ‌కంగా తిరిగే పిల్లుల( Cats ) నుంచి మొదలుకుంటే క్షీర‌దాల( Mammals ) వ‌ర‌కు ఈ ద్వీపాలు గ‌మ్య‌స్థానాలుగా మారాయి. మ‌రి ఆ ద్వీపాలు ఏవి..? అక్క‌డ ఉంటున్న జంతువులు ఏవి..? అనే విష‌యాల‌ను ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం.

అయోషిమా – క్యాట్ ఐలాండ్( Aoshima, Japan – The Cat Island )

జ‌పాన్‌లోని అయోషిమా పిల్లుల‌కు నిల‌యంగా ఉంది. ఇక్క‌డ మాన‌వ జ‌నాభా కంటే పిల్లుల జ‌నాభానే ఎక్కువగా ఉంది. వాస్త‌వానికి ఫిషింగ్ బోట్ల‌లో ఎలుక‌ల‌ను నియంత్రించ‌డానికి పిల్లుల‌ను తీసుకొచ్చారు. దాంతో క్ర‌మ‌క్ర‌మంగా పిల్లుల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరిగింది. అయోషిమాకు వ‌చ్చే ప‌ర్యాట‌కులు.. పిల్లులు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తున్నాయి. నివాసాల పై క‌ప్పుల‌పై, వీధుల్లో.. ప‌ర్యాట‌క ప్రాంతాల్లో ఎక్క‌డంటే అక్క‌డ పిల్లులు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి.

ఒకునోషిమా – ర్యాబిట్ ఐలాండ్ ( Okunoshima, Japan – Rabbit Island )

జ‌పాన్‌లోని ఒకునోషిమా కుందేళ్లకు ఆవాసంగా మారింది. ఒకప్పుడు ఇక్క‌డ పెద్ద ఎత్తున ర‌హ‌స్య ర‌సాయ‌న ఆయుధాల ఉత్ప‌త్తికి కేంద్రంగా ఉండేది. కానీ ఇప్పుడు పూర్తిగా విరుద్ధం. ర‌సాయ‌న ఆయుధాల ఉత్ప‌త్తి కేంద్రం.. ఇప్పుడు కుందేళ్ల ఆవాసాల‌కు నిల‌య‌మైంది. ఒకునోషిమాలో మ‌నుషుల మాదిరి కుందేళ్లు ఎక్క‌డంటే అక్క‌డ ద‌ర్శ‌న‌మిస్తూ ప‌ర్యాట‌కులకు, స్థానికుల‌కు క‌నువిందు క‌లిగిస్తున్నాయి. ఈ ద్వీపంలో కార్లు లేనే లేవు. కుందేళ్ల‌దే సామ్రాజ్యం అని చెప్పొచ్చు.

పిగ్ బీచ్ – బ‌హామ‌స్( Pig Beach, Bahamas – The island of swimming pigs )

బ‌హామ‌స్‌లోని ద్వీపం పిగ్ బీచ్‌ల‌కు ప్ర‌సిద్ధి పొందింది. ఇక్క‌డ జ‌నాలు త‌క్కువ‌. బీచ్‌లో పందులే ఎక్కువ‌గా ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. స‌ముద్రంలో పందులు స్విమ్ చేస్తూ ప‌ర్యాట‌కుల‌ను అల‌రిస్తుంటాయి. ప‌ర్యాట‌కుల‌తో సైతం పందులు స్నేహ‌పూర్వ‌కంగా ఉంటాయి. వాటితో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు ప‌ర్యాట‌కులు ఉత్సాహం చూపిస్తుంటారు.

అడ‌వి గుర్రాలు – కెన‌డా ( Sable Island, Canada – Home of the Wild Horses )

కెన‌డాలోని అట్లాంటిక్ మ‌హా స‌ముద్రంలోని మారుమూల ఇసుక దిబ్బ‌నే సాబుల్ ఐలాండ్. ఈ ద్వీపం వంద‌లాది అడ‌వి గుర్రాల‌కు నిలయంగా మారింది. చ‌ట్టం ద్వారా ర‌క్షించ‌బ‌డుతున్న గుర్రాలు ఈ ద్వీపంలో స్వేచ్ఛ‌గా తిరుగుతుంటాయి. ప‌చ్చిక బ‌య‌ళ్ల‌పై సేద‌తీరుతుంటాయి. ఇక్క‌డ మాన‌వ కార్య‌కలాపాలు త‌క్కువ‌.

ఇల్హా డా క్వీమాడా గ్రాండే – స్నేక్ ఐలాండ్ ( Ilha da Queimada Grande, Brazil – Snake Island )

బ్రెజిల్‌లోని ఇల్హా డా క్వీమాడా గ్రాండే స్నేక్ ఐలాండ్‌గా పేరుగాంచింది. ఇక్క‌డ అత్యంత విష‌పూరిత పాములు ఉంటాయి. ఇది మాన‌వ నిషేధిత ద్వీపం. అత్యంత విష‌పూరిత పాముల‌కు నెల‌వైన ఈ ఐలాండ్‌లోకి మాన‌వుల‌కు ప్ర‌వేశం లేదు. పూర్తిగా నిషేధించారు. దీంతో పాములు స్వేచ్ఛ‌గా తిరుగుతూ ఉన్నాయి.