Raja Saab | ‘రాజాసాబ్’పై మరోసారి ట్రోల్స్… హీరోయిన్ ఫైట్ సీన్‌లో డూప్ వాడారంటూ వైరల్ అవుతున్న ఫోటోలు
Raja Saab |పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ సినిమా విడుదలకు ముందే సోషల్ మీడియాలో ట్రోల్స్‌కు గురైన విషయం తెలిసిందే. టీజర్ విడుదలైనప్పుడే గ్రాఫిక్స్ నాణ్యతపై విమర్శలు వెల్లువెత్తాయి. కథలో మంచి అంశాలు ఉన్నప్పటికీ వాటిని సరిగా తెరకెక్కించకపోవడం, రిలీజ్ ప్లానింగ్ లో లోపాలు ఉండటం వంటి కారణాలతో సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది.
Raja Saab |పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ సినిమా విడుదలకు ముందే సోషల్ మీడియాలో ట్రోల్స్‌కు గురైన విషయం తెలిసిందే. టీజర్ విడుదలైనప్పుడే గ్రాఫిక్స్ నాణ్యతపై విమర్శలు వెల్లువెత్తాయి. కథలో మంచి అంశాలు ఉన్నప్పటికీ వాటిని సరిగా తెరకెక్కించకపోవడం, రిలీజ్ ప్లానింగ్ లో లోపాలు ఉండటం వంటి కారణాలతో సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో అభిమానుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత మరో విషయం చర్చకు దారి తీసింది. పలు యాక్షన్ సన్నివేశాలు, డ్యాన్స్ షాట్లలో ప్రభాస్ స్థానంలో డూప్‌ను ఉపయోగించారనే ఆరోపణలు వినిపించాయి. ఓటిటి రిలీజ్ తరువాత కొన్ని సీన్స్‌ను కట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ అంశం మరింత వైరల్ అయ్యింది. దర్శకుడు మారుతిపై అప్పట్లో పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి.
ఇప్పుడు అదే సినిమాకు సంబంధించి మరో వివాదం తెరపైకి వచ్చింది. హీరోయిన్ మాళవిక మోహనన్ నటించిన ఒక ఫైట్ సీన్‌లో కూడా డూప్ వాడారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సినిమాలో విలన్ పాత్రలో నటించిన రాన్సన్ విన్సెంట్ తాజాగా ఆ ఫైట్ సీన్‌కు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. ఒక ఫోటోలో మాళవికతో ఫైట్ చేస్తున్న దృశ్యం ఉండగా, మరో ఫోటోలో ఆమెకు డూప్‌గా పనిచేసిన ఫైటర్‌తో దిగిన చిత్రం కనిపించింది.
ఆ ఫోటోల ఆధారంగా మాళవిక మోహనన్‌కు డూప్‌గా ఒక పురుష ఫైటర్‌ను ఆమె లుక్‌కు దగ్గరగా మేకప్ చేసి, అదే కాస్ట్యూమ్స్‌లో సిద్ధం చేసి సీన్ చిత్రీకరించినట్టు నెటిజన్లు చర్చిస్తున్నారు. ముఖ్యంగా ఫైట్ సీన్‌లో హీరోయిన్ స్థానంలో అబ్బాయిని డూప్‌గా ఉపయోగించారనే అంశం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతోంది. దీంతో ప్రభాస్ అభిమానులు, సినీ ప్రేమికులు మరోసారి దర్శకుడు మారుతిపై విమర్శలు గుప్పిస్తున్నారు. “సినిమాలో అందరికీ డూప్‌లనే పెట్టారా?” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమా విడుదల తర్వాత మారుతి మీడియా ముందుకు ఎక్కువగా రాకపోవడం కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది.
మొత్తంగా థియేటర్లలో నిరాశపరిచిన ‘రాజాసాబ్’, ఓటిటి విడుదల అనంతరం మరోసారి ట్రోల్ మెటీరియల్‌గా మారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. అభిమానుల అంచనాలను అందుకోలేకపోయిన ఈ చిత్రం ఇప్పుడు డూప్ వివాదంతో మళ్లీ వార్తల్లో నిలవడం విశేషం.
View this post on Instagram
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram