Anasuya | స్టార్ యాంకర్ అనసూయపై సోషల్ మీడియాలో అసభ్యక‌ర‌మైన‌ పోస్టులు.. నిందితుడు అరెస్ట్

Anasuya | టాలీవుడ్ నటి, ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్‌పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టి వేధింపులకు పాల్పడిన వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై జరుగుతున్న సైబర్ వేధింపులపై మరోసారి చర్చకు దారితీసింది.

Anasuya | టాలీవుడ్ నటి, ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్‌పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టి వేధింపులకు పాల్పడిన వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై జరుగుతున్న సైబర్ వేధింపులపై మరోసారి చర్చకు దారితీసింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా పులివెందుల మండలం జూటూర్ గ్రామానికి చెందిన జనార్దన్ నగరానికి వచ్చి గచ్చిబౌలి ఇంద్రానగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. సోషల్ మీడియాలో ఎక్కువ వ్యూస్, ఫాలోవర్లు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో అతడు నటి అనసూయను టార్గెట్ చేశాడు.

న‌కిలీ వీడియోల‌తో…

జనార్దన్, అనసూయకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలను మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా ఎడిట్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు ఇతర సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా ఏఐ సాంకేతికత ఉపయోగించి నకిలీ వీడియోలను రూపొందించి, ఆమెపై అనుచిత వ్యాఖ్యలతో పోస్టులు పెట్టినట్లు విచారణలో బయటపడింది. ఈ పోస్టులు ఆమె వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నాయని పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై అనసూయ.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలను సేకరించి నిందితుడిని గుర్తించిన పోలీసులు అతడిని కడపలో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో జనార్దన్ తను చేసిన తప్పును ఒప్పుకున్నట్లు సమాచారం. కేవలం సోషల్ మీడియాలో పేరు, ఫాలోయింగ్ సంపాదించుకోవాలనే ఉద్దేశంతో సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకున్నట్లు అతడు పోలీసులకు చెప్పినట్లు తెలిసింది.

ప‌లు సెక్ష‌న్ల కింద కేసులు..

నిందితుడిపై పలు చట్టపరమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు అతడిని మరింతగా విచారిస్తున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో ఎవరైనా వ్యక్తుల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా పోస్టులు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఇదిలా ఉండగా, మరో కేసులో కూడా ఓ సినీనటి పోస్టు చేసిన యూట్యూబ్ రీల్స్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ మారేడ్‌పల్లికి చెందిన ఆటో డ్రైవర్ అరుణ్ కుమార్ ఒక సినీనటి పోస్టు చేసిన రీల్స్‌ను చూసి అసభ్యకర వ్యాఖ్యలు చేసినట్లు గుర్తించారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అరెస్ట్ చేసి వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న సైబర్ వేధింపులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Latest News