Anasuya | ఆ స్టార్స్ ఎవరు మహిళల గురించి మాట్లాడలేదు, ఎన్టీఆర్ ఒక్కరే మాట్లాడారు.. అనసూయ వ్యాఖ్యలు వైరల్
Anasuya | టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ మహిళల గౌరవం గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన చెప్పిన మాటలు అభిమానులు, నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి
Anasuya | టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ మహిళల గౌరవం గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన చెప్పిన మాటలు అభిమానులు, నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. సమాజంలో మహిళలకు గౌరవం, భద్రత ఎంత ముఖ్యమో తెలియజేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రశంసలు అందుకుంటున్నాయి.
ఆదివారం బెంగళూరులో నిర్వహించిన ఓ ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం ఆసుపత్రి సిబ్బందితో ఆయన ఆప్యాయంగా మాట్లాడారు. ఈ సందర్భంగా వారు అడిగిన పలు ప్రశ్నలకు తారక్ సమాధానాలు ఇచ్చారు. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రస్తుత సమాజంలో మహిళలను ఎలా గౌరవించాలి అనే ప్రశ్నకు ఆయన ఆసక్తికరంగా స్పందించారు.
నా పిల్లలకి నేర్పిస్తాను..
ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ, మహిళలను గౌరవించడం అనే విషయం ప్రత్యేకంగా నేర్పించాల్సిన అంశం కాకూడదని అన్నారు. మనిషి పుట్టుకతోనే స్త్రీల పట్ల గౌరవం ఉండాలని ఆయన పేర్కొన్నారు. కుటుంబంలోనే పిల్లలకు సరైన విలువలు నేర్పిస్తే సమాజం మెరుగుపడుతుందని చెప్పారు. నిజం చెప్పాలంటే మహిళలను ఎలా గౌరవించాలో పదేపదే గుర్తు చేస్తూ ఉండటం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే మనిషి పుట్టుకతోనే మహిళల పట్ల గౌరవం మొదలవ్వాలి. మనం మన పిల్లలకు ఇంట్లోనే మంచి విలువలను నేర్పించాలి. నా ఇద్దరు కుమారులను కచ్చితంగా మహిళలకు గౌరవం ఇచ్చేలా పెంచుతానని నేను మీకు మాటిస్తున్నాను అని ఎన్టీఆర్ తెలిపారు.
ప్రస్తుతం సమాజంలో మహిళల భద్రత, గౌరవం వంటి అంశాలపై విస్తృతంగా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో తారక్ చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తన కుమారులను మహిళలను గౌరవించే ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతానని ఆయన చెప్పడం అభిమానులను ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో కూడా ఆయన మాటలను చాలా మంది ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ వ్యాఖ్యలపై ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ కూడా స్పందించారు. మహిళా సాధికారతపై ఎప్పుడూ గళం విప్పే అనసూయ ఈ విషయంపై సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
అనసూయ స్పందన వైరల్..
ఎన్టీఆర్ మాట్లాడిన వీడియోను షేర్ చేస్తూ అనసూయ స్పందిస్తూ… “మహిళల గురించి ఒక స్టార్ మాట్లాడటం చూడటం చాలా చాలా ఆనందంగా ఉంది” అని పేర్కొన్నారు. ఒక పెద్ద స్టార్ హీరో మహిళల గౌరవం గురించి మాట్లాడటం చాలా సంతోషంగా ఉందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఇతర స్టార్ హీరోలు కూడా ఈ విషయాలపై మాట్లాడాలని ఆమె సూచించినట్లుగా నెటిజన్లు భావిస్తున్నారు.ప్రస్తుతం అనసూయ చేసిన ఈ ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే నెటిజన్ల నుంచి వచ్చే స్పందనలను దృష్టిలో పెట్టుకుని ఆమె తన కామెంట్ బాక్స్‌ను ఆఫ్ చేసినట్లు తెలుస్తోంది.
మొత్తానికి మహిళల గౌరవం గురించి జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీస్తున్నాయి. మహిళలను గౌరవించే సమాజం నిర్మించడంలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను గుర్తుంచుకోవాలని ఆయన చెప్పిన సందేశం ఎంతో మందికి స్ఫూర్తినిచ్చేలా ఉంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram