మేడ్చల్‌లోని టెక్ మహీంద్రా కంపెనీ ముందు ఉద్యోగిని ధర్నా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తనను అకారణంగా జాబ్‌లో నుంచి తీసివేశారని, తనకు ఆరోగ్యం బాగలేక 13రోజులు, పాపకు ఆరోగ్యం బాగాలేదని 3 రోజులు సెలవు కావాలని కోరితే ఉద్యోగం నుంచి తీసేశారని సాఫ్ట్ వేర్ ఉద్యోగిని భావన ఆవేదన వ్యక్తం చేస్తూ న్యాయం చేయాలంటూ నిరసనకు దిగింది.
ఆరోగ్యం బాగాలేక కంపెనీలో పడిపోతే కనీసం పట్టించుకోలేదని, 14 రోజులు ట్రీట్‌మెంట్ తీసుకుంటే ఆ సమయంలో కూడా ఉద్యోగంలో నుంచి తీసేస్తామని బెదిరించారని భావన ఆరోపించింది. ఆఫీస్ లో వాష్ రూమ్ కు వెళ్లాలన్న అనుమతి తీసుకోవాలని నిబంధనలు పెట్టారని తెలిపారు. నా అనారోగ్యానికి సంబంధించిన చికిత్స, నా కూతురు అందించిన చికిత్సకు సంబంధించి అన్ని డాక్యుమెంట్లు కంపెనీ అధికారులు సమర్పించినప్పటికి నన్ను ఉద్దేశపూర్వకంగానే జాబ్‌లో నుంచి తీసేశారని భావన ఆరోపించింది. ఈ మేరకు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం కావాలని కంపెనీ ముందు ధర్నాకు దిగారు.
ఫ్యామిలీ ఉండే మహిళా ఉద్యోగినిల పట్ల కంపెనీలు ఇంత కఠినంగా ఉండకూడదని ఆమె అభ్యర్థించారు. ఈ కంపెనీ అధికారులు నాతో వ్యవహరించినట్లుగా మరొకరి పట్ల వ్యవహరించకూడదని నేను పోరాటం చేస్తున్నట్లుగా ఆమె ప్రకటించారు. నన్ను అక్రమంగా జాబ్ లో నుంచి తీసేసిన అధికారులపై కంపెనీ యాజమాన్యం చర్యలు తీసుకునేంతవరకు ఇక్కడి నుంచి కదలనని స్పష్టం చేశారు. భావన నిరసనకు నెటిజన్లు భారీగా మద్దతు పలుకుతున్నారు.
మేడ్చల్‌లోని టెక్ మహీంద్రా కంపెనీ ముందు ధర్నాకు దిగిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని భావన
తనను అకారణంగా జాబ్‌లో నుంచి తీసివేశారని, పాపకు ఆరోగ్యం బాగాలేదని 3 రోజులు సెలవు కావాలని కోరితే ఉద్యోగం నుంచి తీసేశారని భావన ఆవేదన
ఆరోగ్యం బాగాలేక కంపెనీలో పడిపోతే కనీసం పట్టించుకోలేదని, 14 రోజులు… https://t.co/9iimUJ6vu4 pic.twitter.com/J6pHXZQlew
— Telugu Scribe (@TeluguScribe) July 23, 2026