• Telugu News
  • /News

Hyderabad Techie | సాఫ్ట్‌వేర్ జాబ్ పోవడంతో.. ఇంటిపై గంజాయి సాగు చేస్తున్న హైదరాబాద్ టెక్కీ.. వీడియో వైరల్

Hyderabad Techie | గంజాయికి బానిసైన హైదరాబాద్ టెక్కీ.. ఉద్యోగం పోవడంతో ఇంటిపైనే గంజాయి మొక్కల సాగు చేయడం మొదలుపెట్టాడు. చివరకు ఎక్సైజ్ అధికారులకు దొరికిపోయాడు.

Reported by: Chandram | వార్త‌లు | Apr 21, 2026, 8:40 pm IST
Read Time: 4 mins
Hyderabad Techie | సాఫ్ట్‌వేర్ జాబ్ పోవడంతో.. ఇంటిపై గంజాయి సాగు చేస్తున్న హైదరాబాద్ టెక్కీ.. వీడియో వైరల్

Hyderabad Techie | సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.. చెప్పుకోదగ్గ జీతం.. కానీ మత్తు అతని జీవితాన్ని నాశనం చేసింది. హైదరాబాద్‌కు చెందిన ఓ టెక్కీ గంజాయికి బానిసై ఉద్యోగం కోల్పోయాడు. చివరకు డబ్బుల కోసం ఇంటిపైనే గంజాయి సాగు చేయడం మొదలుపెట్టాడు. కానీ అతని అక్రమ వ్యవహారం ఎక్సైజ్ అధికారులకు తెలిసిపోయింది. దీంతో అతన్ని అరెస్టు చేసి, బంగ్లాపై పెంచిన 17 మొక్కలను స్వాధీనం చేసుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. నాచారంలోని తూర్పు గాంధీనగర్‌కు చెందిన సీహెచ్ శశిధర్ ఐటీ ఉద్యోగి. సాఫ్ట్‌వేర్ కొలువు చేస్తున్న సమయంలో ఏర్పడిన పరిచయాలు అతడిని తప్పుదారి పట్టించాయి. చెడు స్నేహాల కారణంగా గంజాయి అలవాటు చేసుకున్నాడు. గంజాయికి బానిస కావడంతో వచ్చిన జీతం మొత్తం దానికే ఖర్చు చేసేవాడు. దాని మత్తులోనే తూలుతూ ఉండటంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కూడా పోయింది. దీంతో చేతిలో డబ్బుల్లేకుండా అయిపోయింది.

 


అలాంటి దుర్భర స్ఠితిలోనే శశిధర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. బయట ఎక్కడో గంజాయి కొనేందుకు డబ్బులు ఖర్చు చేసే బదులు తానే పెంచాలని అనుకున్నాడు. అనుకున్నట్లుగానే ఇంటిపై పెద్ద ఎత్తున పూల కుండీలను ఏర్పాటు చేసి.. వాటిల్లో గంజాయి మొక్కలను నాటాడు. కానీ ఈ విషయం బయటకు మొక్కడంతో రంగారెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్ రంగంలోకి దిగింది. శశిధర్ ఇంటిపై మెరుపు దాడి చేసింది.

ఈ క్రమంలో శశిధర్ ఇంటిపై ఏకంగా 17 గంజాయి మొక్కలను గుర్తించారు. వీటిలో కొన్ని మొక్కలు పూతకు రాగా.. మరికొన్ని మూడు మీటర్ల ఎత్తు వరకు పెరిగాయని ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏ టీమ్ సీఐ బాలరాజు తెలిపారు. వీటి ద్వారా సుమారు 10 కిలోల గంజాయి లభిస్తుందని అంచనా వేశారు. శశిధర్‌ను అరెస్టు చేసి.. ఘట్‌కేసర్ ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించారు.

Read More:

Aishwarya Rai | విడాకుల రూమర్స్‌కు చెక్.. వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా ఫోటో షేర్ చేసిన ఐశ్వర్య-అభిషేక్

Chai Guy | లేఆఫ్‌లో ఉద్యోగం పోతే.. అమెరికాలో ఛాయ్ అమ్ముతూ సక్సెస్ అయ్యాడు!