Anasuya | మళ్లీ హాట్ టాపిక్‌గా శివాజీ -అనసూయ వివాదం.. మీడియా హెడ్‌లైన్ త‌ప్పుగా రాసిందంటూ కామెంట్

Anasuya | కొద్ది రోజుల క్రితం మహిళల డ్రెస్సింగ్‌పై చేసిన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్న సీనియర్ నటుడు శివాజీ మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. ఆ సమయంలో నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ ఘాటుగా స్పందించడంతో ఈ వ్యవహారం ఇండస్ట్రీలో పెద్ద దుమారం రేపింది. ఆ వివాదం తగ్గిపోయిందనుకుంటున్న సమయంలో, తాజాగా అనసూయ చేసిన ఓ సెటైరికల్ పోస్ట్ ఈ అంశాన్ని మళ్లీ వార్తల్లోకి తీసుకొచ్చింది.

  • By: Sandeep |    movies |    Published on : Apr 12, 2026 10:36 AM IST
Anasuya | మళ్లీ హాట్ టాపిక్‌గా శివాజీ -అనసూయ వివాదం.. మీడియా హెడ్‌లైన్ త‌ప్పుగా రాసిందంటూ కామెంట్

Anasuya | కొద్ది రోజుల క్రితం మహిళల డ్రెస్సింగ్‌పై చేసిన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్న సీనియర్ నటుడు శివాజీ మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. ఆ సమయంలో నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ ఘాటుగా స్పందించడంతో ఈ వ్యవహారం ఇండస్ట్రీలో పెద్ద దుమారం రేపింది. ఆ వివాదం తగ్గిపోయిందనుకుంటున్న సమయంలో, తాజాగా అనసూయ చేసిన ఓ సెటైరికల్ పోస్ట్ ఈ అంశాన్ని మళ్లీ వార్తల్లోకి తీసుకొచ్చింది.

వివాదం ఎలా మొదలైంది?

‘దండోరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శివాజీ మహిళల వస్త్రధారణపై వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఆయన కామెంట్స్‌పై మహిళా సంఘాలు, సినీ ప్రముఖులు అభ్యంతరం వ్యక్తం చేయగా, అనసూయ కూడా కఠినంగా స్పందించారు.దీంతో ఈ విషయం సోషల్ మీడియా నుంచి ఇండస్ట్రీ వరకు పెద్ద చర్చగా మారింది. అనంతరం శివాజీ పలు ప్రెస్ మీట్లు నిర్వహించి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.

మళ్లీ వైరల్ అయిన వీడియో

ఇటీవల అనసూయ చీర కట్టుకుని తన కుటుంబంతో కలిసి ఆలయానికి వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను కొందరు నెటిజన్లు షేర్ చేస్తూ, “శివాజీ కామెంట్స్ ఎఫెక్ట్‌తో చీరలో కనిపిస్తున్న అనసూయ” అంటూ వ్యంగ్యంగా పోస్టులు పెట్టారు.

అనసూయ సెటైరికల్ కౌంటర్

ఈ పోస్టులపై అనసూయ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.“శివాజీ సృష్టించిన చీర ధరించి తిరుగుతున్న అనసూయ అంటూ హెడ్‌లైన్ పెట్టాలి. ఎందుకంటే మేము ఇంతకుముందు అసలు చీరలు కట్టుకోలేదుగా” అంటూ వ్యంగ్యంగా స్పందించారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె వ్యాఖ్యలకు పలువురు నెటిజన్లు మద్దతు తెలుపుతున్నారు.

మళ్లీ చర్చలోకి వచ్చిన వివాదం

ఈ పోస్ట్‌తో మళ్లీ శివాజీ–అనసూయ వివాదం చర్చకు వచ్చింది. గతంలో శివాజీ కూడా తన వ్యాఖ్యలపై స్పందిస్తూ, “ఆ రెండు పదాలు మాట్లాడకుండా ఉండాల్సింది” అని అంగీకరించారు. అలాగే అనసూయపై తనకు గౌరవం ఉందని కూడా తెలిపారు.

ఇక ఈ వ్యవహారంపై కొందరు నెటిజన్లు, అసలు ఇందులో పెద్దగా వివాదం లేకపోయినా సోషల్ మీడియాలోనే దీనిని మళ్లీ మళ్లీ లేవనెత్తుతున్నారని అభిప్రాయపడుతున్నారు. పాత వీడియోలు, పోస్టులను షేర్ చేస్తూ లేని పోని కాంట్రవర్సీలు సృష్టిస్తున్నారంటున్నారు.