విధాత : మార్చురీలో మృతదేహంపై లైంగిక దాడి ఘటన.. కామం మనిషిని మృగంగా మార్చుతుందనడానికి నిదర్శనంగా నిలిచింది. మధ్యప్రదేశ్ బుర్హాన్‌పూర్ జిల్లాలోని ఖక్నార్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మార్చురీలో జరిగిన దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2024 ఏప్రిల్ 18న స్ట్రెచర్‌పై ఉన్న మహిళ మృతదేహాన్ని పక్కకు లాక్కెళ్లి నీలేష్ భిలాలా(25) అనే కామాంధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఏడాదిన్నర తర్వాత సీసీఫుటేజీ ద్వారా ఈ విషయం బయటపడింది.
వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన వైద్యాధికారి డాక్టర్ ఆదియా దావర్ అక్టోబర్ 7న స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆసుపత్రి సిబ్బంది ఫిర్యాదుతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కోసం జైలుకు తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీ గదిలోకి నిందితుడు ఎలా ప్రవేశించాడు అన్నది దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
A man arrested in MP’s Burhanpur district for ‘abusing’ a woman’s body at a community health centre. The shocker became public after videos of the April 2024 incident went viral. It exposed state of security at govt health facilities. @santwana99 @jayanthjacob @NewIndianXpress pic.twitter.com/rjoPihyUqF
— Anuraag Singh (@anuraag_niebpl) October 8, 2025