Muzaffarnagar Highway Accident : లక్కీ స్పాట్.. తప్పిన చావు !

బ్రేకులు ఫెయిల్ అయిన ట్రక్కు బైక్‌ను ఢీకొట్టినా.. ఇద్దరు అద్భుతంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డై వైరల్‌గా మారింది.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Mar 31, 2026, 4:45 pm IST
Read Time: 3 mins
Muzaffarnagar Highway Accident : లక్కీ స్పాట్.. తప్పిన చావు !

విధాత : భూమి మీద నూకలుంటే ఎన్ని ప్రాణ గండాలపైన ఏం చేయలేవనడానికి ఉదాహరణగా ఓ రోడ్డు ప్రమాదం వీడియో నిలిచింది. ముజఫర్‌నగర్‌లో ఢిల్లీ-డెహ్రాడూన్ జాతీయ రహదారిపై, ఇసుకతో నిండిన ఓ ట్రక్కు బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిల్ అయిన ట్రక్కు రోడ్డుపై తన ముందున్న లు వాహనాలను ఢీకొట్టింది. ఓ బైక్‌పైకి దూసుకెళ్లింది.

ట్రక్కు ఢీకొట్టడంతో బైక్‌పై ఉన్న కన్హయ్య, అతని సోదరి కిందపడిపోయారు. వారి మీద నుంచి ట్రక్కు వెళ్లిపోయిందని అంతా అనుకున్నారు. వారి ప్రాణాలు దక్కవనుకున్నారు. అయితే అక్కడే అద్భుతం జరిగింది. వారిద్దరు ఎలాంటి తీవ్ర గాయాలు లేకుండా ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. బైక్ ను ఢీకొట్టిన ట్రక్కు ట్రాలీ టైర్లు వారి పడిపోయిన పక్క నుంచే వెళ్లిపోయింది.

చివరకు ఆ ట్రక్కు డివైడర్‌పైకి ఎక్కి ఆగింది. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డవ్వగా..అది వైరల్ గా మారింది. ఈ ప్రమాదానికి కారణమై ట్రక్కు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు భూమిపై నూకలుండి..బతకాలని రాసి ఉంటే ఏ ప్రమాదం ఏం చేయలేదనడానికి ఈ ఘటన నిదర్శనమని కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి :

Maoinabad Farmhouse Drugs Case : ఫామ్ హౌస్ కేసు.. ముగ్గురు నిందితుల కస్టడీ పొడింపు
డైవర్షన్ పాలిటిక్స్‌ కోసమే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్: హరీశ్ రావు