ICICI Bank | ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. తొలిసారిగా ఇంటర్నెట్, క్రెడిట్‌కార్డ్, డెబిట్‌కార్డుకు సంబంధించిన సేవలను లాక్, అన్‌లాక్ సేవలను చేసేందుకు సరికొత్తగా బ్యాంకు స్మార్ట్‌లాక్‌ను తీసుకువచ్చింది. ఖాతాదారులకు భద్రతకు పెద్దపీట వేస్తూ సేవలను పరిచయం చేసింది. ఈ ఫీచర్ సహాయంతో వినియోగాదారులు బ్యాంకు సేవలను అప్పటికప్పడు లాక్, అన్‌లాక్ చేసుకునేందుకు వీలుంటుంది. ఫోన్, ఈ-మెయిల్ కానీ, కస్టమకేర్ ఎగ్జిక్యూటివ్ సహాయం లేకుండానే వాడుకునేందుకు అవకాశం కల్పించింది. బ్యాంకు సంబంధించి ఐమొబైల్ పే (iMobile Pay) యాప్ సహాయంతో యూజర్స్ ఈ ఫీచర్‌ను వాడుకోవచ్చు.
ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, క్రెడిట్ కార్డు, డెబిట్‌కార్డులకు సంబంధించిన బటన్ క్లిక్ చేస్తే లాక్, అన్‌లాక్ చేసుకోవచ్చరు. మేజర్ స్మార్ట్‌లాక్, భారతీయ బ్యాంకింగ్ రంగంలో మొట్టమొదటిది. నిర్ధిష్ట వ్యవధిలో బ్యాంకింగ్ సేవలను యాక్టివేట్, డీయాక్టివేట్ చేసేందుకు కస్టమర్‌లను ఈ-సేవను ఉపయోగించుకోవచ్చు. మోసపూరిత లావాదేవీలను అరికట్టేందుకు ఎంతో ఉపయోగపడనున్నది. స్మార్ట్‌లాక్, ఐసీఐసీఐ బ్యాంక్ హెడ్ డిజిటల్ ఛానల్స్, పార్టనర్‌షిప్ సిద్ధార్థ్ మిశ్రా మాట్లాడుతూ.. కస్టమర్స్ ఖాతాల సెక్యూరిటీని బలోపేతం చేసేందుకు, వారి ప్రయోజనాలను రక్షించడంలో మరో ప్రయత్నంగా స్మార్ట్‌లాక్‌ను ప్రారంభించామన్నారు. ఈ డూ-ఇట్-యువర్సెల్ఫ్ (DIY) సదుపాయం కస్టమర్ల చేతుల్లోనే మెరుగైన భద్రతతో బ్యాంకింగ్ సేవలను యాక్సెస్ చేయడానికి అనుమతి ఇస్తుందన్నారు.
స్మార్ట్‌లాక్‌ను ఎలా వినియోగించాలంటే..
- మొదట ఐమొబైల్ పే యాప్‌లోకి లాగిన్ కావాలి.
- హోమ్ స్క్రీన్ దిగువన కుడివైపున మూలన ఉనన స్మార్ట్‌లాక్ సర్వీసెస్‌పై క్లిక్ చేయాలి.
- మీరు లాక్-అన్‌లాక్ చేయాలనుకుంటున్న కీ బ్యాంకింగ్ సర్వీసులపై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత ధ్రువీకరించాల్సి ఉంటుంది.
- ఈ మొబైల్ పేని ఉపయోగించడానికి ముందు ఏదైనా బ్యాంక్ కస్టమర్లు తమ బ్యాంక్ ఖాతాను యాప్‌కి లింక్ చేసుకోవచ్చు.
- యూపీఐ ఐడీని క్రియేట్ చేసుకొని లావాదేవీలను జరుపుకునేందుకు వీలుంటుంది.