Site icon vidhaatha

Credit Card New Rules | ఐసీఐసీఐ అమెజాన్‌ పే క్రెడిట్‌ కార్డ్‌ ఉందా..? ఈ రూల్స్‌ మారాయని తెలుసా..?

Credit Card New Rules | అమెజాన్‌ పే ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డ్‌ వినియోగదారులకు బ్యాడ్‌న్యూస్‌. జూన్‌ నుంచి కార్డ్‌ రూల్స్‌ మారబోతున్నాయి. ఈ కార్డ్‌తో అద్దె చెల్లింపుపై ప్రస్తుతం ఒకశాతం రివార్డ్‌ పాయింట్‌ పాయింట్‌ ఇస్తున్నది. ఇకపై రివార్డ్‌ పాయింట్స్‌ను ఎత్తివేయబోతున్నది. ఐసీఐసీఐ బ్యాంక్‌ అమెజాన్‌ పే క్రెడిట్‌కార్డుకు సంబంధించిన రూల్స్‌ను మార్చివేసింది. మారిన నిబంధనలు జూన్‌ 18 నుంచి అమలులోకి రానున్నాయి. ప్రస్తుత కాలంలో క్రెడిట్‌కార్డుల వినియోగం భారీగా పెరిగాయి. అత్యవసర పరిస్థితుల్లో క్రెడిట్‌కార్డులు చాలా అవసరాలను తీర్చుకునేందుకు అవసరమవుతున్నాయి.

క్రెడిట్ కార్డ్ వినియోగదారులు కార్డ్‌ని ఉపయోగించడం ద్వారా రివార్డ్‌లు, క్యాష్‌బ్యాక్, క్రెడిట్ పాయింట్లు మొదలైన వాటి ప్రయోజనాలను అందుతాయి. ప్రస్తుతం మార్కెట్‌లో చాలా క్రెడిట్ కార్డులు అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులు అన్ని కార్డ్‌లపై విభిన్న ఆఫర్‌లను బ్యాంకులు అందజేస్తున్నాయి. మార్కెట్‌లో అందుబాటులో ఉన్న కార్డ్‌లలో ఒకటి Amazon Pay ICICI క్రెడిట్ కార్డ్ ఒకటి. ఈ కార్డుపై బ్యాంకుల్లో ఇంధనం పోయించిన సమయంలో క్యాస్‌బ్యాక్‌ సైతం వస్తుంది. వచ్చే నెల నుంచి Amazon Pay ICICI క్రెడిట్ కార్డ్ నిబంధనలలో మార్పులు జరగనున్నాయి. మీ వద్ద కూడా ఈ కార్డ్‌ ఉందా? అయితే జూన్‌ 18 నుంచి మారబోయే రూల్స్‌ గురించి తెలుసుకోవడం ఉత్తమం.

ప్రస్తుతం ఐసీఐసీఐ బ్యాంక్‌ అమెజాన్‌ పే కార్డు ద్వారా అద్దె చెల్లింపులు చేస్తే ఒకశాతం వరకు రివార్డు పాయింట్స్‌లను జారీ చేసింది. జూన్‌ 18 నుంచి ఈ రివార్డులను నిలిపివేయబోతున్నది. అంటే ఇకపై అద్దె చెల్లింపుల ద్వారా ఎలాంటి రివార్డు పాయింట్లు రాబోవన్నమాట. ఇక క్రెడిట్‌కార్డు హోల్డర్స్ పెట్రోల్‌, డీజిల్‌ పోయించే సమయంలో ఈ కార్డును ఉపయోగిస్తే ప్రతిసారీ సర్‌చార్జీ చెల్లింపుపై ఒకశాతం తగ్గింపు పొందనున్నారు. ఈ కార్డ్‌పై రివార్డ్‌లపై ఎలాంటి పరిమితి లేదు. అలాగే పాయింట్‌లను రిడిమ్‌ చేసుకునేందుకు డేట్‌ కూడా ఉండదు.

అదే సమయంలో ఈ కార్డుతో ఈఎంఐపై బంగారం కొనుగోలు చేసినట్లు ఎలాంటి రివార్డు పాయింట్లు లభించవు. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అమెజాన్, వీసాతో కలిసి ఐసీఐసీఐ బ్యాంక్ ద్వారా జారీ చేస్తుంది. అమెజాన్ ప్రైమ్ సభ్యులు షాపింగ్‌పై అదనపు రివార్డ్ పాయింట్స్‌ వస్తాయి. జీవితకాల ఉచిత క్రెడిట్ కార్డ్‌లో చేరేందుకు ఎలాంటి వార్షిక ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అమెజాన్‌లో కొనుగోళ్లపై 5శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఎవరైనా అమెజాన్ ప్రైమ్ మెంబర్ కాకపోయినా అమెజాన్ ఇండియాలో చేసే ఖర్చుపై 3శాతం క్యాష్‌బ్యాక్‌ని పొందే అవకాశం ఉంటుంది.

కార్డుని ఉపయోగించి చెల్లింపులపై 2శాతం క్యాష్‌బాక్‌ పొందవచ్చు. షాపింగ్, డైనింగ్, బీమా చెల్లింపులు, ట్రావెల్‌ ఇతర ఖర్చులపై ఒకశాతం వరకు క్యాష్‌బ్యాక్‌ వస్తుంది. క్రెడిట్ కార్డ్ బిల్లును రూపొందించిన 3 రోజుల్లోగా ఈ రివార్డ్ పాయింట్‌లు అమెజాన్ పే వాలెట్‌లో క్రెడిట్‌ అవుతాయి. ఒక రివార్డ్ పాయింట్ ఒక రూపాయికి సమానం. అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన తర్వాత ఎవరైనా క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కంపెనీ మొదట యూజర్‌కి ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న డిజిటల్ కార్డ్‌ని ఇస్తుంది, ఆ తర్వాత వినియోగదారు కొరియర్ ద్వారా ఫిజికల్ కార్డ్‌ను పంపుతుంది.

Exit mobile version