ఆకాశాన్నంటుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల మంట‌..

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇంధన ధరల పెంపు కొనసాగుతున్నాయి. శుక్రవారం పెట్రోల్‌, డీజిల్‌ ధరలను చమురు కంపెనీలు పెంచాయి. ఇప్పటికే ధరలు ఆల్‌టైమ్‌ గరిష్ఠస్థాయికి చేరగా.. తాజాగా లీటర్‌ పెట్రోల్‌పై 28 పైసలు, డీజిల్‌పై 32 పైసలు వరకు పెరిగింది. కొత్తగా పెంచిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ రూ.96.93, డీజిల్‌ రూ.87.69కు పెరిగింది. మరో వైపు మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో పెట్రోల్‌ రూ.105 మార్క్‌ను దాటింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో పెట్రోల్‌ ధర […]

  • Publish Date - June 18, 2021 / 08:46 AM IST
  • న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇంధన ధరల పెంపు కొనసాగుతున్నాయి.
  • శుక్రవారం పెట్రోల్‌, డీజిల్‌ ధరలను చమురు కంపెనీలు పెంచాయి.

ఇప్పటికే ధరలు ఆల్‌టైమ్‌ గరిష్ఠస్థాయికి చేరగా.. తాజాగా లీటర్‌ పెట్రోల్‌పై 28 పైసలు, డీజిల్‌పై 32 పైసలు వరకు పెరిగింది.

కొత్తగా పెంచిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ రూ.96.93, డీజిల్‌ రూ.87.69కు పెరిగింది. మరో వైపు మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో పెట్రోల్‌ రూ.105 మార్క్‌ను దాటింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో పెట్రోల్‌ ధర రూ.103కి చేరింది.

మరో వైపు రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో పెట్రోల్‌ రూ.108.07 డీజిల్‌ రూ.100.82కు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినా.. దేశంలో చమురు కంపెనీలు ధరలను పెంచాయి.

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత మే 4వ తేదీ నుంచి ఇప్పటి వరకు 27 సార్లు ధరలు పెరగ్గా.. పెట్రోల్‌పై రూ.6.61, డీజిల్‌ రూ.6.91 పెరిగింది. ఫిబ్రవరి 26న ఐదు రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడగా.. చివరిసారిగా ఫిబ్రవరి 27న ధరలు పెరగ్గా..

ఆ తర్వాత ధరలు పెరుగలేదు. గురువారం అమెరికా మార్కెట్లో ట్రేడింగ్ ముగిసే సమయానికి..

బ్రెంట్ ముడి బ్యారెల్‌కు 1.31 డాలర్లు తగ్గి 73.08 డాలర్లకు పడిపోయింది. యూఎస్‌ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ 1.11 డాలర్లు తగ్గి.. బ్యారెల్‌ 71.04 వద్ద ట్రేడవుతోంది.

దేశంలోని వివిధ నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

న్యూఢిల్లీలో పెట్రోల్‌ రూ.96.93, డీజిల్‌ రూ.87.69

ముంబైలో పెట్రోల్‌ రూ.103.08, డీజిల్‌ రూ.95.14

హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.100.74, డీజిల్ రూ.95.59

విజయవాడలో పెట్రోల్‌ రూ.102.69, డీజిల్‌ రూ.96.97

చెన్నైలో పెట్రోల్‌ రూ.98.14, డీజిల్‌ రూ.92.31

కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.96.84, డీజిల్‌ రూ.90.54

భోపాల్‌లో పెట్రోల్ రూ.105.13, డీజిల్‌ రూ.96.35

రాంచీలో పెట్రోల్‌ రూ.92.91, డీజిల్‌ రూ.92.57

బెంగళూరులో పెట్రోల్‌ రూ.100.17, డీజిల్‌ రూ.92.97

పాట్నాలో పెట్రోల్‌ రూ.99, డీజిల్‌ రూ.93.01

చండీగఢ్‌లో పెట్రోల్‌ రూ.93.22, డీజిల్‌ రూ.87.34

లక్నోలో పెట్రోల్‌ రూ.94.14, డీజిల్‌ రూ.88.10