Site icon vidhaatha

Pure EV: కెనడా సంస్థతో జట్టుకట్టిన ప్యూర్… యూఎస్, కెనడాలో ఎనర్జీ స్టోరేజ్‌కు బాటలు

Pure EV| తెలంగాణకు చెందిన బ్యాటరీ టెక్నాలజీ, పవర్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ప్యూర్.. కెనడాకు చెందిన ఛార్జ్ పవర్‌తో చేతులు కలిపింది. తద్వారా అమెరికా, కెనడా ఎనర్జీ స్టోరేజ్ మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. ఇకపై ప్యూర్ తమ ‘ప్యూర్ పవర్’ ఉత్పత్తులను యూఎస్, కెనడా మార్కెట్లకు ఎగుమతి చేస్తుంది. అమెరికాలో గ్రిడ్ స్థాయి ఉత్పత్తులపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. కెనడాలో మాత్రం కమర్షియల్, ఇండస్ట్రియల్ (C&I), గ్రిడ్ స్థాయి ఉత్పత్తులపై ఎక్కువగా ఫోకస్ పెట్టనున్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా ప్యూర్ యొక్క అత్యాధునిక ఎనర్జీ స్టోరేజ్ ఉత్పత్తులు కెనడా, అమెరికా వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయి. ఇరు సంస్థలు కలిసి తమ బ్రాండ్లను ప్రోత్సహించుకుంటాయి. ప్యూర్ పవర్ ఉత్పత్తులు హై ఎనర్జీ డెన్సిటీ కలిగిన లిథియం-అయాన్ బ్యాటరీలతో, 5వ తరం పవర్ ఎలక్ట్రానిక్స్‌తో, ఇంటెలిజెంట్ క్లౌడ్, ప్రిడిక్టివ్ ఏఐ ప్లాట్‌ఫామ్‌తో రూపొందించబడ్డాయి. దీనివల్ల రిమోట్ ద్వారా పర్యవేక్షణ సాధ్యమవుతుంది. దాదాపు 100% పనితీరు, అంతరాయాలు లేని సేవలు వినియోగదారులకు లభిస్తాయి. ప్యూర్ పవర్ ఉత్పత్తుల్లో అత్యాధునికమైన, పలు స్థాయిల్లో పనిచేసే థర్మల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఉంది.

ఇందులో సెల్ స్థాయిలో నానో-పీసీఎం కూలింగ్, ప్యాక్, ర్యాక్ స్థాయిలో లిక్విడ్ కూలింగ్ ఉంటాయి. ఇది వేడిని సమర్థవంతంగా తగ్గిస్తుంది, ఎక్కువ కాలం మన్నికనిస్తుంది, అత్యుత్తమ రౌండ్-ట్రిప్ ఎఫిషియెన్సీని, ప్రపంచ స్థాయి భద్రతను అందిస్తుంది. ప్యూర్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నిశాంత్ దొంగరి మాట్లాడుతూ.. ప్యూర్ పవర్ అనేది ఎనిమిది సంవత్సరాల కృషి ఫలితమన్నారు. ఇప్పటికే రెసిడెన్షియల్, కమర్షియల్, పెద్ద పరిశ్రమల్లో అనేక ఉత్పత్తులు విజయవంతంగా పనిచేస్తున్నాయని తెలిపారు. బ్యాటరీ టెక్నాలజీ, పవర్ ఎలక్ట్రానిక్స్‌లో తమకున్న లోతైన అనుభవం, బలమైన తయారీ సౌకర్యాలతో తమ వినూత్నమైన, మన్నికైన, నమ్మకమైన ఎనర్జీ స్టోరేజ్ ఉత్పత్తులు అమెరికా, కెనడా మార్కెట్లలో విస్తృతంగా ఆదరణ పొందుతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. నార్త్ అమెరికాలో 4 గిగావాట్ల‌కు పైగా ప్రాజెక్టులను పూర్తి చేసిన అనుభవం, ఈపీసీ, మార్కెటింగ్, సేల్స్‌లో బలమైన నైపుణ్యం కలిగిన ఛార్జ్ పవర్‌తో భాగస్వామ్యం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇరు సంస్థల బలాలు, సామర్థ్యాలను ఉపయోగించి రాబోయే నెలల్లో ఈ మార్కెట్లలో గణనీయమైన ప్రభావం చూపుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ మార్కెట్లు తమ గ్లోబల్ విస్తరణ వ్యూహంలో కీలకమైన భాగమని ఆయన పేర్కొన్నారు.

అదే మా లక్ష్యం…

ఛార్జ్ పవర్ ఇంక్ మేనేజింగ్ డైరెక్టర్ రవి పిన్నెల్లి మాట్లాడుతూ.. ప్యూర్ యొక్క అధునాతన బ్యాటరీ టెక్నాలజీలు, ప్రత్యేకమైన ప్లాట్‌ఫామ్‌లు తమ లక్ష్యానికి అనుగుణంగా ఉన్నాయని తెలిపారు. అధిక పనితీరు, నిలకడ కలిగిన ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్‌ను అందించడమే తమ లక్ష్యమన్నారు. ప్యూర్ యొక్క బలమైన తయారీ సామర్థ్యాలు, ఛార్జ్ పవర్ యొక్క ఈపీసీ, సిస్టమ్ ఇంటిగ్రేషన్, లైఫ్‌సైకిల్ మేనేజ్‌మెంట్‌లోని నిరూపితమైన నైపుణ్యం కలిసి అద్భుతమైన ఫలితాలను ఇస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తమకున్న ప్రాజెక్ట్ అనుభవం, విశ్వసనీయమైన క్లయింట్ సంబంధాలు, నార్త్ అమెరికాలో ఉన్న బలమైన ఉనికి, ప్యూర్ పవర్ యొక్క విజయవంతమైన ఉత్పత్తి శ్రేణి కలిసి రెసిడెన్షియల్, కమర్షియల్, గ్రిడ్-స్కేల్ కస్టమర్లకు అసాధారణమైన విలువను అందిస్తాయని ఆయన అన్నారు. అమెరికా ఎనర్జీ స్టోరేజ్ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. 2033 నాటికి 70.7 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. వార్షిక వృద్ధి రేటు 13.9%గా ఉండొచ్చని భావిస్తున్నారు. కెనడా మార్కెట్ కూడా గణనీయంగా వృద్ధి చెందుతుందని, 2030 నాటికి 18.38 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ఇక్కడ వార్షిక వృద్ధి రేటు 15.8%గా ఉండొచ్చని భావిస్తున్నారు. రెసిడెన్షియల్, కమర్షియల్, గ్రిడ్ అప్లికేషన్‌లలో ఎనర్జీ స్టోరేజ్ ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్‌కు ప్రధాన కారణం సోలార్, విండ్ పవర్ వంటి పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం పెరుగుతుండటమే.

Exit mobile version