Ratan Tata | ప్రముఖ దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా (Ratan Tata). ఆయన హయాంలో టాటా కంపెనీ సూపర్ సక్సెసర్‌గా నిలిచింది. నష్టాల్లో ఉన్న కంపెనీలను సైతం కొనుగోలు చేసి లాభాలబాట పట్టించిన ఘనత ఆయనది. గొప్ప మానవతావాదిగా, వ్యాపారవేత్తగా రాణించిన ఆయన వైవాహిక జీవితానికి మాత్రం దూరంగా ఉన్నాయి. ఇందుకు కారణాలు లేకపోలేదు. ప్రేమలో పడ్డ ఆయన అనుకోని కారణాలతో విడిపోవాల్సి వచ్చింది. దాంతో ఆయన ఒంటరి జీవితం గడపాల్సి వచ్చింది. ఈ విషయాన్ని రతన్ టాటా స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
జెంషెడ్ జీ టాటా దత్తపుత్రుడిగా..
రతన్ టాటా 1937 డిసెంబర్ 28న జన్మించారు. జంషెడ్ జీ టాటా ఆయన ముత్తార. 1948లో రతన్ టాటాకు పదేళ్ల వయసున్న సమయంలో తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. దాంతో ఆయన నాయనమ్మ నవాజ్ బాయి టాటా వద్ద పెరిగారు. ఆయన జెంషెడ్‌జీ టాటా దత్తపుత్రుడు. ఆయన ప్రతిష్టాత్మకమైన కేథడ్రల్, జాన్ కానన్ స్కూల్, బిషప్ కాటన్ స్కూల్ (సిమ్లా), కార్నెల్ విశ్వవిద్యాలయం, హార్వర్డ్ పూర్వ విద్యార్థి. రతన్ టాటా 1955లో న్యూయార్క్‌లోని రివర్ డేల్ కంట్రీ స్కూల్ నుంచి డిప్లొమా అందుకున్నారు. 1961లో టాటా గ్రూప్‌లో తన కెరీర్‌ను మొదలుపెట్టారు. ఆ తర్వాత హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో మేనేజ్‌మెంట్ డిగ్రీ పూర్తి చేశారు. 2004లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ప్రారంభించారు. క్రమక్రమంగా యావత్ భారతం గర్వపడే వ్యాపారవేత్తగా నిలిచారు. ఇక దాతృత్వానికి పర్యాయపదంగా నిలిచారు రతన్ టాటా. లెక్కలేనంత సంపదను దాతృత్వ కార్యక్రమాలకు వినియోగించారు.
ప్రేమకు అడ్డుగా ఇండో-చైనా యుద్ధం
వ్యాపారంలో ఎన్నో మైలురాళ్లు సంపాదించిన రతన్ టాటాకు ఓ లవ్ స్టోరీ ఉన్నది. ఆయన అమెరికాలో ఉన్న సమయంలో ఓ యువతితో లవ్‌లో పడ్డారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించారు. అదే సమయంలో రతన్ టాటా అమ్మమ్మ ఆరోగ్య సమస్యలతో భారత్‌కు తిరిగి వచ్చారు. ఆ సమయంలో భారత్ – చైనా మధ్య యుద్ధం జరుగుతున్నది. దాంతో యువతి కుటుంబం ఆమెను భారత్‌కు పంపేందుకు అంగీకరించలేదు. దాంతో వారి ప్రేమ పెళ్లి పీటల వరకు చేరలేదు. అయితే, రతన్ టాటా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భార్య, పిల్లలు లేకపోవడంతో కొన్నిసార్లు తాను ఒంటరినని అనిపిస్తుందని చెప్పుకొచ్చారు. చాలామంది అమ్మాయిలతో ప్రేమలో పడ్డా.. పనుల్లో బిజీగా ఉండడంతో వివాహం వరకు వెళ్లలేదని చెప్పారు.
పెళ్లి జరుగకపోవడానికి సరైన సమయం దొరక్కపోవడానికి కూడా ఓ కారణమన్నారు. పలుసార్లు ప్రయత్నించినప్పటికీ ఎందుకో వర్కౌట్ కాలేదన్నారు. పదేళ్ల వయసులో తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారని.. దాంతో తన సోదరుడు, తాను ఇబ్బందులుపడ్డామన్నారు. ఆ రోజుల్లో విడాకులు అనేవి సహసం కాదని.. తన తల్లి రెండో పెళ్లి చేసుకోవడంతో స్కూల్‌లో పిల్లలు ర్యారింగ్ చేసుకునేవారంటూ గుర్తు చేసుకున్నారు. అయతే తమకు నాయనమ్మ గౌరవంగా, గొడవలు పడకుండా బతకడం నేర్పిందని.. అది నేటికి నాలో ఉందంటూ చెప్పుకొచ్చారు. వ్యాపారరంగంలో సూపర్ సక్సెస్‌గా నిలిచిన అనంతరం చాలా సమయాల్లో పెళ్లి ఆలోచన వచ్చినా.. కుటుంబానికి సరైన సమయం కేటాయించలేమోననే భయం వేసేదని.. ఈ క్రమంలో పెల్లి చేసుకునేందుకు ప్రయత్నించినా ఆ తర్వాత దూరంగా ఉన్నట్లు వివరించారు.