విద్యుత్ వినియోగ‌దారుల‌కు షాక్.. ఇక గూగుల్ పే, ఫోన్ పే నుంచి బిల్లుల చెల్లింపులు కుద‌ర‌దు..

విద్యుత్ వినియోగ‌దారుల‌కు టీజీఎస్పీడీసీఎల్ షాకిచ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ఆయా బ్యాంకుల యాప్‌ల‌తో పాటు ఇత‌ర యాప్‌ల ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించేవారు. ఇక నుంచి అలాంటి అవ‌కాశం లేదు

  • Publish Date - July 1, 2024 / 05:46 PM IST

హైద‌రాబాద్ : విద్యుత్ వినియోగ‌దారుల‌కు టీజీఎస్పీడీసీఎల్ షాకిచ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ఆయా బ్యాంకుల యాప్‌ల‌తో పాటు ఇత‌ర యాప్‌ల ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించేవారు. ఇక నుంచి అలాంటి అవ‌కాశం లేదు. ఎందుకంటే రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేర‌కు స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల‌ను టీజీఎస్పీడీసీఎల్ నిలిపివేసింది. ఆర్బీఐ ఆదేశాల మేర‌కు ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే వంటి యాప్‌ల ద్వారా ఇక విద్యుత్ బిల్లుల చెల్లింపు కుద‌ర‌దు. టీజీఎస్పీడీసీఎల్ వెబ్‌సైట్, టీజీఎస్పీడీసీఎల్ యాప్ ద్వారా మాత్ర‌మే క‌రెంట్ బిల్లులు చెల్లించాల‌ని టీజీఎస్పీడీసీఎల్ విజ్ఞ‌ప్తి చేసింది. ఈ నిబంధన జూలై 01, 2024 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ మేర‌కు టీజీఎస్పీడీసీఎల్ అధికారికంగా ప్ర‌క‌టించింది.

Latest News