విధాత, : గత వారం రోజులుగా భారీగా పెరుతూ పైపైకి పోతున్న వెండి, బంగారం ధరలు శనివారం మాత్రం తగ్గుదలను నమోదు చేశాయి. ముఖ్యంగా వెండి కిలో ధర ఏకంగా రూ. 5000తగ్గి కొనుగోలు దారులను ఆశ్చర్యపరిచింది. తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన సిల్వర్ కిలో ధర రూ.2,10,000 వద్ద కొనసాగుతుంది. వరుసగా ఐదురోజుల రూ.19,100పెరిగిన వెండి..ఒక్కసారిగా రూ.5వేలు తగ్గడం విశేషం. అంతర్జాతీయ పరిణామాల కారణంగా వెండి ధరలు భారీ హెచ్చు తగ్గులకు లోనవుతున్నాయని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.270 తగ్గి రూ.1,33,910గా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.250 తగ్గి రూ.1,22,750 వద్ద కొనసాగుతుంది.
ఇవి కూడా చదవండి :
CP Sajjanar Warns Transgenders : ట్రాన్స్‌జెండర్లకు హైదరాబాద్ సీపీ సజ్జనర్ హెచ్చరిక
Elon Musk| ఎలాన్ మస్క్ కు ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య జెమీమా లేఖ
